Bigg Boss Telugu 7: పోటుగాళ్లకి ఝలక్‌ ఇచ్చిన కంటెస్టెంట్లు.. నామినేషన్లలో ఉంది వీరే?

By Aithagoni Raju  |  First Published Oct 9, 2023, 2:22 PM IST

కొత్తగా వచ్చిన వారు నామినేషన్ల ప్రక్రియలో పాతవారిని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి గట్టి ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి. పాత తప్పులనే మిస్టేక్స్ గా చూపి నామినేట్‌ చేయడం విచిత్రంగా అనిపించింది. 


బిగ్‌ బాస్‌ తెలుగు 7 ఆదివారం నుంచి ప్రారంభమైంది. కింగ్‌ నాగార్జున ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని తెలిపారు. అంతేకాదు `బిగ్‌ బాస్‌ 2.0` అంటూ పేరు కూడా పెట్టారు. ఈ సారి షో ఉల్లాపుల్టా అన్నట్టుగానే కొత్తగా చేశారు. ఐదు వారాల తర్వాత ఐదుగురు కొత్త కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇప్పించారు. భోలే షావలి, అశ్విని, అంబటి అర్జున్‌, నయని పావని, పూజా మూర్తి హౌజ్‌లోకి అడుగుపెట్టారు. 

అయితే కొత్తగా వచ్చిన వారికి పోటుగాళ్లు అనే పేరుపెట్టారు నాగ్‌. కొత్త వారితోపాటు పాత వారు కూడా హౌజ్‌లో కన్ఫమ్‌ అయినట్టుగా తెలిపారు. అయితే సోమవారం ఎపిసోడ్‌లో అసలు ఆట ప్రారంభమైంది. కొత్తగా వచ్చిన వారు నామినేషన్ల ప్రక్రియలో పాతవారిని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి గట్టి ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి. పాత తప్పులనే మిస్టేక్స్ గా చూపి నామినేట్‌ చేయడం విచిత్రంగా అనిపించింది. 

Latest Videos

అయితే దీనికి వాళ్లు కూడా స్ట్రాంగ్‌ కౌంటర్లిస్తున్నారు. తేజని నయని పావని నామినేట్‌ చేసింది. నీ గేమ్‌ కూడా ఎక్కడ ఎక్కువగా ఆడినట్టు నాకు అనిపించలేదని తెలిపింది. అయితే ఇక్కడ గేమ్‌లు ఆడటమే ముఖ్యం కాదు, ఎంటర్టైన్‌మెంట్స్ కూడా చేయడం కూడా ముఖ్యమే అని తెలిపాడు. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ, కానీ ఎవరు డిజర్వ్ కాదో వాళ్ల పేర్లు చెబుతున్నా అని కవర్‌ చేసుకుంది. 

భోలే షావలి.. సందీప్‌ని నామినేట్‌ చేస్తూ గౌతమ్‌ని తేజ బెల్ట్ పట్టి లాగే టాస్క్ లో సంచాలక్ గా మీరు దాన్ని ఆపాలి కదా అని అనగా, బయటకు వచ్చాక అరిచిన మొదటి వ్యక్తిని నేనే అని సందీప్‌ చెప్పగా, షావలి వద్ద ఆన్సర్‌ లేదు. ఆ తర్వాత పూజా మూర్తి కూడా తేజని నామినేట్‌ చేస్తూ గౌతమ్‌ని బెల్ట్ తో లాగే సంఘటనే కారణంగా చెబుతూ నామినేట్‌ చేసింది.

ఆ తర్వాత అశ్విని.. అమర్‌ దీప్‌ని నామినేట్‌ చేస్తూ.. మీరు సెల్ఫిష్‌గా ఆడినట్టు అనిపించింది అని చెప్పగా, సెల్ఫిష్‌గానే ఆలోచించాలండీ. అది నా గేమ్‌.. ఇక్కడికి వచ్చిందే నాకోసం నేను ఆలోచించడానికి అని చెప్పడంతో ఆశ్వినికి మాట లేదు. గ్రూపిజం చేస్తున్నారంటూ శోభా శెట్టిని నామినేట్‌ చేసింది అశ్విని. గ్రూపిజం ఏంటో చెప్పండి, ఉదాహరణ చెప్పండి అని, ఏ మీరు నష్టపోయారా? అని నిలదీసింది. ఈ పరిస్థితి రేపు మీకు కూడా రావచ్చు అని చెప్పగా, దీనికి అశ్విని వద్ద ఆన్సర్‌ లేదు. 

అనంతరం ఇతర కంటెస్టెంట్లకి నామినేట్‌ చేసే అవకాశం ఇచ్చినట్టు సమాచారం. అలా ఈ వారం అమర్‌ దీప్‌, సందీప్‌, తేజ, ప్రిన్స్ యావర్‌తోపాటు కొత్త వాళ్లు అశ్విని, నయని పావని, పూజా మూర్తి కూడా నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. మరి వీరిలో ఎవరు ఉంటారు? ఎవరు హౌజ్‌ని వీడుతారనేది చూడాలి. ఇక ఆదివారం శుభ శ్రీ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. గౌతమ్‌ ని సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారు బిగ్‌ బాస్‌. 
 

click me!