రానా 'హిరణ్యకశ్యప'.. అధికార ప్రకటన!

Published : Jun 01, 2019, 01:57 PM IST
రానా 'హిరణ్యకశ్యప'.. అధికార ప్రకటన!

సారాంశం

రానా ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ భారీ పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యప' తెరకెక్కించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. 

రానా ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ భారీ పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యప' తెరకెక్కించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన రాకపోవడంతో అసలు ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనే సందేహాలు కలిగాయి.

ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ తన సోషల్ మీడియా పేజీలో ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టాడు. గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలిపారు.

ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషిస్తున్నాడని, సినిమాకు  సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రానా తన సొంత బ్యానర్ లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు