చివరికి అఖిల్‌ కూడా సంక్రాంతికే.. ‘ఏజెంట్’ రిలీజ్ పై అప్డేట్.. మేకర్స్ కాన్ఫిడెన్స్ మాములుగా లేదుగా!

Published : Oct 24, 2022, 01:47 PM IST
చివరికి అఖిల్‌ కూడా సంక్రాంతికే.. ‘ఏజెంట్’ రిలీజ్ పై అప్డేట్.. మేకర్స్ కాన్ఫిడెన్స్ మాములుగా లేదుగా!

సారాంశం

అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil) - సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న చిత్రం ‘ఏజెంట్’. రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీపావళి సందర్భంగా మూవీ రిలీజ్ పై మేకర్స్ అప్డేట్ అందించారు.   

అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నుంచి సాలిడ్ సక్సెస్ ను అందుకోలేదు. ఎట్టకేలకు చివరిగా తన నాల్గో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఆ హిట్ ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు అఖిల్. ఇందుకోసం తన రాబోయే చిత్రం ‘ఏజెంట్’తో మాస్ హిట్ అందుకోవాలని ఎదరుచూస్తున్నాడు. రచయిత వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే చిత్ర పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్సాన్స్ దక్కుతోంది. 

ఇప్పటికే చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. ఆగస్టు 12నే విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ మళ్లీ వాయిదా వేశారు. తాజాగా దీపావళి సందర్భంగా Agent చిత్ర రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ అందించారు. ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఏజెంట్’ను సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నామని తెలిపారు. అయితే జనవరిలో ఏ తేదీన విడుదల చేస్తారనేది అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతికి రాబోతుండటంతో తర్వలోనే పక్కా డేట్ ను లాక్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

అయితే, అఖిల్ సినిమా కూడా సంక్రాంతికే లాక్ కావడంతో వచ్చే ఏడాది పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఏర్పడనుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, ఏజెంట్ కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఈ బడా హీరోల సినిమాలకు పోటీగా అఖిల్ ‘ఏజెంట్’కూడా బరిలో నిలవబోతుండటం విశేషం. మేకర్స్ కాన్ఫిడెంట్ చూస్తుంటే సాలిడ్ హిట్ కొట్టేట్టు ఉన్నారని అర్థమవుతోంది. మూవీలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. హీరోయిన్ గా సాక్షి వైద్య అలరించనుంది. చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ రెడ్డి 2 కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ