చిరంజీవిని ఇలా చూపిస్తాడని ఊహించలేదు.... ముఠామేస్త్రి ని గుర్తు చేసిన వాల్తేరు వీరయ్య!

Published : Oct 24, 2022, 12:11 PM IST
చిరంజీవిని ఇలా చూపిస్తాడని ఊహించలేదు.... ముఠామేస్త్రి ని గుర్తు చేసిన వాల్తేరు వీరయ్య!

సారాంశం

అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వాల్తేరు వీరయ్య టీజర్ ఉంది. చిరంజీవి దీపావళి ట్రీట్ అదిరింది. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వింటేజ్ డేస్ గుర్తు చేశారు.   

అభిమానుల కోసం చిరంజీవి దీపావళి ట్రీట్ తో వచ్చారు. ఆయన 154వ చిత్ర టైటిల్ అండ్ టీజర్ విడుదల చేశారు. ప్రచారం అయినట్లే టైటిల్ వాల్తేరు వీరయ్యగా ప్రకటించారు. అయితే చిరంజీవి ఊర మాస్ లుక్, మేనరిజం గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. చెవికి పోగు, నోట్లో బీడీ, లుంగీ ధరించిన చిరంజీవి ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం ముఠామేస్త్రి ని గుర్తు చేశాడు.  అభిమానులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న దర్శకుడు బాబీ అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో ప్రజెంట్ చేశారు. 

ఇక విడుదల తేదీపై కూడా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చారు. 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే విజయ్ వారసుడు, బాలయ్య వీరసింహారెడ్డి, ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాల మేకర్స్ సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సైతం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. నేటి అధికారిక ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. ఇక నలుగురు టాప్ స్టార్స్ సంక్రాంతికి తలపడనున్నారు. 

రెండున్నర నిమిషాల టీజర్లో చిరంజీవిని దర్శకుడు బాబీ ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. చివర్లో రవితేజ దివాళి విషెస్ తెలియజేశారు . ఆయన లుక్ మాత్రం రివీల్ చేయలేదు. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ పాత్రపై ఎలాంటి సమాచారం లేదు. కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నా అధికారిక సమాచారం లేదు. మైత్రి మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ