టాలీవుడ్ లో చిన్న సినిమాల వర్షం కురుస్తోంది. ధియోటర్స్ ఇక దొరకవేమో అన్నట్లుగా మొత్తం రిలీజ్ అయిపోతున్నాయి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
టాలీవుడ్ లో చిన్న సినిమాల వర్షం కురుస్తోంది. థియేటర్స్ ఇక దొరకవేమో అన్నట్లుగా మొత్తం రిలీజ్ అయిపోతున్నాయి. అలాంటి వాటిల్లో కాస్తంత చెప్పుకోదగ్గ బజ్ క్రియేట్ చేయగలిగిన సినిమా 'నువ్వు తోపురా' . శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో ఓ కీలక పాత్రధారిగాగా నటించిన సుధాకర్ కోమాకుల హీరోగా తెరపై చేసిన తొలి ప్రయత్నమే ఈ సినిమా. ట్రైలర్ లో తెలంగాణా స్లాంగ్ లో హీరో చెప్పిన డైలాగులు, కొద్ది పాటి యాక్షన్ ..సినిమాపై క్యూరియాసిటీని కలగచేసాయి. సినిమా ఆ క్యూరియాసిటిని క్యాష్ చేసుకోగలిగిందా..కథ ఏంటి...వచ్చే వారం మహర్షి వచ్చేక కూడా నిలబడే కంటెంట్ ఈ సినిమాలో ఉందా ...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
undefined
కథేంటి..
సూరి (సుధాకర్ కోమాకుల) పరమ బేవార్స్. చిన్నప్పుడే తండ్రి చనిపోవటంతో భాధ్యతలు భుజాన ఎత్తుకున్న తల్లి (నిరోష) అతనిపై దృష్టి పెట్టలేకపోతుంది. దాంతో తల్లి, కొడుకుల మధ్య గ్యాప్ పెరుగుతుంది. కుటుంబం సంగతి ప్రక్కన పెడితే..అతను రమ్య (నిత్యా శెట్టి)తో ప్రేమలో పడతాడు. కానీ కొన్ని చిన్న కారణంతో ఆమె బ్రేకప్ చేసుకుని అమెరికాకు వెళ్లిపోతుంది. ఓ ప్రక్క నిరుద్యోగం, ఆదాయం లేకపోవటం సమస్యలతో పాటు ఇప్పుడు ఈ బ్రేకప్ సమస్య తోడు అవటంతో కుర్రాడు కాస్త ఇబ్బందుల్లో పడతాడు.
అయితే అదృష్టం అతని వైపు ఉండటంతో .. అమెరికాలోని తెలుగు అసోషియేషన్ నిర్వహిస్తున్న పోగ్రామ్ లో డ్రమ్స్ వాయించే ఛాన్స్ సూరికి వస్తుంది. దాంతో అమెరికా వెళ్లిన సూరి..అక్కడ వారితో గొడవ పెట్టుకుంటాడు. దాంతో.. తిరిగి రావడానికి కుదరక అక్కడే ఓ షాప్‌లో పనికి కుదరుతాడు. అక్కడితో ఆగుతాడా.. అక్కడ కొందరు డ్రగ్ డీలర్స్‌కు సహాయం చేసి వారికి ఫ్రెండ్ అవుతాడు. లాగే గ్రీన్ కార్డ్ కోసం అక్కడే ఉన్న అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు..
డబ్బులు అవసరమై అక్కడ డ్రగ్ మాఫియాతో గొడవ పడతాడు ఇలా డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆ క్రమంలో చాలా సమస్యలు వస్తాయి. అసలు సూరి డబ్బు కోసం ఎందుకంత డెస్పరేట్ గా మారాడు. అమెరికాలో తన లవర్ ని కలుసుకున్నాడా. రియలైజ్ అయ్యి..కుటుంబానికి దగ్గరయ్యాడా వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది..
ఈ సినిమాకు ప్రధాన లోపం..బలమైన నెగిటివ్ క్యారక్టర్ లేకపోవటం. దాంతో కథ దారి తప్పి తన ఇష్టం వచ్చినట్లు ఓ లక్ష్యం అంటూ లేకుండా మెలికలు తిరుగుతూ అవే కథలో మలుపులా ఫీలవుతూ ముందుకు వెళ్ళిపోయింది. అలాగే అసలు కథలో కి బాగా టైమ్ తీసుకోవటం కూడా విసిగిస్తుంది. ఫస్టాఫ్ కేవలం హీరోయిన్ తో రొమాన్స్, ఫైట్స్ ,ప్రెండ్స్ తో కబుర్లు అన్నట్లుగా కాలక్షేపంగా నడిపించేసాడు. సెకండాఫ్ లో కథ ..ఎంత ఉందంటే ...చాలా పెద్దది. అదీ ఓ డైరక్షన్ లో వెళ్లనది.
ఎటు నుంచి ఎటైనా వెల్తుంది. హీరో కు మంచో , చెడో ఓ క్యారక్టరైజేషన్ ఉంటే దానికి తగ్గట్లు ఆ క్యారక్టర్ ఆర్క్ ని డిజైన్ చేసి, దానికి తగ్గట్లు సీన్స్ పడేవి. ఈ సినిమాలో అది మిస్సైంది. కాసేపు మంచి గా ఉంటాడు. మరికాసేపు డ్రగ్స్ అమ్ముతూంటాడు. ఒక లక్ష్యం...దాన్ని ఛేధించటం అనే పద్దతి ప్రకారం పోదు. దాంతో ఏ క్షణానికి ఈ పాత్ర ఎలా బిహేవ్ చేస్తోందో అని చూసేవాడికి సందేహం వస్తుంది.
ఫెరఫెక్ట్...
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏదన్నా ఉందీ అంటే అది సుధాకర్ నటనే. మనకు రెగ్యలర్ గా హైదరాబాద్ బస్తీలలో కనిపించే కుర్రాడిని గుర్తు తెస్తాడు. తెలంగాణా యాస మాట్లాడుతూ... సరూర్ నగర్ సూరిగా ఫెరఫెక్ట్ గా క్యారక్టర్ లోకి వెళ్లాడు. మంచి పాత్ర పడితే దుమ్ము రేపుతాడని ఈ సినిమా చూస్తే అర్దమవుతుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్ సపోర్టింగ్ రోల్ సర్పైజే కానీ పండలేదు. అమెరికాలో సూరికి సాయపడే పాత్ర వరుణ్ ది.
మిగతా వాళ్లలో హీరోయిన్ నిత్యాశెట్టి, రవివర్మ, నిరోషా, మహేష్ విట్టా, జబర్ దస్త్ రాకేష్, దువ్వాసి మోహన్ తదితరులు వారి వారి పాత్రల పరిధుల మేర నటించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర పై కనిపించిన నిరోష పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకు కారణం ఆమె క్యారక్టరైజేషన్ లో డెప్త్ లేకపోవటమే.. రెగ్యులర్ హీరో మదర్ అంతే.
దర్శకత్వం ఎలా ఉందంటే..
సరైన కథను , అందుకు తగ్గ స్క్రీన్ ప్లేను ఎంచుకోవటంలోనే దర్శకుడు ప్రతిభ అనేది సాధారణంగా బయిటపడుతుంది. అదే ఈ సినిమాకు మిస్సైంది. ఎక్కడో మొదలైన కథ ..ఎక్కడెక్కడో తిరుగి ముగుస్తుంది. ఓ మసాలా ఎంటర్టైనర్ గా చేయాలనే తపన కనపడుతుంది కానీ అందుకు తగ్గ ప్రోపర్ ఎక్సక్యూషన్ కనపడదు.
టెక్నికల్ గా
ఏవి ఎలా ఉన్నా ...అజ్జు మహంకాళి రాసిన డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. ప్రకాష్ వేలాయుధన్, వెంకట్ సీ దిలీప్‌ల సినిమాటోగ్రఫి హైలెట్ . ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే సెకండాఫ్ లో రిలీఫ్ గా ఉండేదనిపిస్తుంది.సురేష్ బొబ్బిలి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ బాలేవు. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ థాట్
చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలను అనుకరించినంత మాత్రాన తోపులు అయ్యిపోవు
రేటింగ్: 1.5/5
ఎవరెవరు
సమర్పణ: బేబీ జాహ్నవి
సంస్థలు: యునైటడ్ ఫిలింస్, స్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ)
దర్శకత్వం: హరినాథ్ బాబు.బి
నిర్మాత: డి.శ్రీకాంత్
విడుదల: గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్
సహ నిర్మాతలు: డా. జేమ్స్ వాట్ కొమ్ము
అసోసియేట్ నిర్మాత: రితేష్ కుమార్
ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి.
స్టంట్స్: విజయ్ మాస్టర్, డుయ్ బెక్,
కెమెరా: ప్రశాష్ వేలాయుధన్, వెంకట్ సి.దిలీప్,
ఆర్ట్: జెక్ జంజర్,
ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్,
సంగీతం: సురేష్ బొబ్బలి,