సెట్ లో సన్నీలియోన్ కాలికి గాయం.. రక్తం చూసి భయపడుతూ కేకలు.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!

By team telugu  |  First Published Jan 31, 2023, 2:54 PM IST

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ (Sunny Leone) ప్రస్తుతం సౌత్ సినిమాల్లోనూ ఫుల్ అయిపోతోంది. షూటింగ్ బిజీలో ఉంటున్న ఈ బోల్డ్ బ్యూటీకి సెట్ లో చిన్న గాయం అయ్యింది. కాలి వేలికి దెబ్బ తగలడంతో కేకలు వేసింది.
 


పోర్న్ స్టార్‌గా స్టార్ట్ అయిన సన్నీలియోన్.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో మెరిసి స్పెషల్ అపియెర్స్ తో అలరించింది. తన అందాన్ని ఆయుధంగా వాడుకొని ఐటెమ్ సాంగ్స్ లో నటిస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం సౌత్ సినిమాల్లోనూ ఫుల్ బిజీ అవుతున్న సన్నీ లియోన్ నటిగానూ అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం సన్నీ చేతిలో ఐదారు చిత్రాలు ఉన్నాయి. 

ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం సౌత్ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ సెట్ లో సన్నీకి గాయమైంది. పెద్ద గాయమేమీ కాదు. కుడి కాలి బొటనవేలికి గాయం అయ్యింది. దీంతో రక్తం బయటకి  వచ్చింది. దెబ్బ చూడట్టానికి చిన్నదిగా ఉన్నా.. సన్నీ లియోన్ కేకలకు నొప్పితో కూడిన గాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా వెంటనే సిబ్బంది ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఈ క్రమంలో నెమ్మది గాయాన్ని క్లీన్ చేయండి అంటూ వారిపై కేకలు వేసింది. ఇంజెక్షన్ లాంటివి ఏమీవందంటూ వారిని నివారించింది. సన్నీ లియోన్ ధరించిన సినిమా కాస్ట్యూమ్స్ ను బట్టి నెక్ట్స్ సినిమాలో డీగ్లామర్ రోల్ చేయబోతున్నదని తెలుస్తోంది. 

Latest Videos

అయితే సన్నీ లియోన్ ను అభిమానించే వారి సంఖ్య అంతటా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సన్నీ లియోన్ తన కాలి దెబ్బను చూపిస్తూ వీడియోను పంచుకోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏమైంది సన్నీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సన్నీ బాధపడుతుంటూ చూడలేకపోతున్నామంటూ పలువురు కామెంట్లలో తెలుపుతున్నారు. ఇక పోస్ట్ చేసిన క్షణాల్లోనే వీడియో వైరల్ అవుతోంది. 

ఇదిలా ఉంటే సన్నీలియోన్ తెలుగు సినిమాల్లోనూ మెరుస్తోంది. తొలుత కరెంట్ తీగ చిత్రంలో కామియో అపియరెన్స్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సీనియర్ నటుడు డాక్టర్  రాజశేఖర్ ‘గరుడ వేగ’ ఐటెమ్ సాంగ్ తో ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇక గతేడాది విడులైన ‘జిన్నా’ చిత్రంలో విష్ణు సరసన నటించి మెప్పించింది. తన పెర్ఫామెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. హిందీ సినిమాలతో పాటు ప్రస్తుతం మలయాళం, తమిళం చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. గతేడాది డిసెంబర్ 20న ‘హో మై ఘోస్ట్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

click me!