మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతున్న ఎన్టీఆర్, NTR30 షూటింగ్ పరుగులు పెట్టిస్తున్న కొరటాల

Published : May 14, 2023, 07:27 AM IST
మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతున్న ఎన్టీఆర్,  NTR30 షూటింగ్ పరుగులు పెట్టిస్తున్న కొరటాల

సారాంశం

మరోసారి భారీ యాక్షన్ సీక్వెన్స్ లకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రేపటినుంచి ఈసినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో తారక్ తో తలపడటానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ను రంగంలోకి దింపాడు కొరటాల. ఇక ఇప్పటికే ఈసినిమా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ షెడ్యుల్ షూటింగ్ లోనే చాలా వరకూ భారీ యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కించిన కొరటాల.. తాజా షెడ్యూల్ లో కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ లకు రెడీ అవుతున్నట్టు సమాచారం. 

ఎన్టీఆర్ 30 షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు కోరటాల. మూడో షెడ్యూల్ షూటింగ్ కోసం ఇప్పటికే అన్ని సన్నాహాలు చేశాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో రేపటి నుంచి(15 మే) షూటింగ్ స్టార్ట్ కాబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ లో ముఖ్య తారాగణం కూడా కనిపిస్తారని టాక్. ఈసీక్వెన్స్ సినిమాకు హైలెట్ అవ్వబోతుందంటున్నారు సినీజనాలు. ఇక ఈమూవీ కోసం ఇప్పటికే హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రఫర్స్ రంగంలోకి దింపాడు కొరటాల. మొదటి షెడ్యూల్ మాదిరిగానే ఈ షూటింగ్ కూడా వారి ఆద్వర్యంలోనే జరగబోతున్నట్టు సమాచారం. 

ఇక ఈసినిమా నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్ డేట్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్30 నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు టీమ్. సుధాకర్ మిక్కిలినేని తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ నుంచి రామ్ చరణ్ బయట పడలేకపోయా.. మరి ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. హిట్ సాధిస్తాడా..? చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం