భద్రాద్రి రామయ్యకు భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్, ఆదిపురుష్ సక్సెస్ కోసం మొక్కుకున్నారా.. ?

Published : May 14, 2023, 06:45 AM IST
భద్రాద్రి రామయ్యకు భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్, ఆదిపురుష్ సక్సెస్ కోసం మొక్కుకున్నారా.. ?

సారాంశం

వచ్చే నెల ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీగా ఉంది ప్రభాస్ ఆదిపురుష్ సినిమా. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈక్రమంలో ప్రభాస్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి విరాళం ప్రకటించారు.   

వచ్చే నెల ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీగా ఉంది ప్రభాస్ ఆదిపురుష్ సినిమా. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈక్రమంలో ప్రభాస్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి విరాళం ప్రకటించారు. 

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి పాన్ ఇండియా హీరో..  ప్రభాస్‌ 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట ఈ విరాళం మొత్తాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన 10లక్షల చెక్కును ప్రభాస్‌ తరఫున ఆయన బంధువులు శనివారం దేవస్థానం ఈవో ఎల్‌. రమాదేవికి అందజేశారు.  ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా ప్రభాస్ రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసింందే.

ఓం రౌత్ డైరెక్షన్ లో.. ప్రభాస్‌ ఆది పురుష్‌ సినిమాలో  నటిస్తున్నాడు. ఈ  సినిమాలో శ్రీరాముడిగా ఆయన కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా మీద నెగెటీవ్ టాక్ రాగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో.. కాస్త పాజిటీవ్ వేవ్ ను సాధించగలిగారుసినిమా టీమ్. అయినా సరే ఇప్పటికీ కొన్నివివాదాలు ఈసినిమాను చుట్టు ముట్టి ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచా వ్యాప్తంగా భారీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. 


ఈక్రమంలో ఆదిపురుష్ సినిమాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా మొక్కుకున్నారో.. లేక రామడి పాత్ర చేస్తూ..ఇంత భారీ సినిమా చేస్తున్నందుకు.. మన భద్రాద్రి గుర్తుకువచ్చిందో తెలియదు కాని.. భద్రాచాల దేవస్థానానికి మాత్రం ఇలా 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు ప్రభాస్. మరి సినిమా సూపర్ హిట్ అయితే ప్రభాస్ భద్రాచలం వస్తారా..?  చూడాలి మరి. అటు ఆదిపురుష్ ట్రైలర్ మాత్రం ఫ్యూస్ తో దూసుకుపోతోంది. సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో కొన్ని పొరపాట్లు జరిగాయని.. హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటవికి సబంధించిన కంప్లైయింట్స్ ఇప్పటికే సెన్సార్ బోర్డ్ కు చేరాయి. 

మరి ఈక్రమంలో రిలీజ్ వరకూ.. రిలీజ్ తరువాత కూడా ఆదిపురుష్ ఇంకెన్ని కాంట్రవర్సీలను ఫేస్ చేస్తుందో చూడాలి మరి. రాముడిగా ప్రభాస్ నటించగా.. సీతగా ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ కృతి సనన్ నటించింది. రావణ బ్రహ్మగా..సైఫ్అలీ ఖాన్ నటించారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున జూన్ 30న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మూవీ టీమ్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?