వారికి అండగా యంగ్ టైగర్.. ప్రభుత్వంపై పోరాటం చేయనున్న ఎన్టీఆర్ ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 30, 2022, 08:01 PM IST
వారికి అండగా యంగ్ టైగర్.. ప్రభుత్వంపై పోరాటం చేయనున్న ఎన్టీఆర్ ?

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీ కాబోతున్నారు. ముందుగా ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. 

ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ చిత్రం వచ్చింది. ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఆ మూవీ కూడా ఒకటి. ఇప్పుడు వీరిద్దరూ మరో చిత్రానికి రెడీ అవుతుండడంతో ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో NTR 30 కథ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. కొరటాల శివ తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సామాజిక కోణం ఉండేలా చూస్తున్నారు. ఈ చిత్రంలో విద్యావ్యవస్థపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బస్తీలో పుట్టి పెరిగి మెరిట్ లో విద్యాబ్యాసం పూర్తి చేసిన యువకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడట. 

ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థ వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేందుకు డిసైడ్ అవుతాడట. ఈ క్రమంలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా ఎదుగుతాడట. కొరటాల చాలా బలమైన విధంగా ఈ చిత్ర కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  

ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో విద్యార్థిగా నటించాడు. ఆ చిత్రం  ఘనవిజయం సాధించింది. జనతాగ్యారేజ్ చిత్రంలో పర్యారణం కోసం పోరాడే యువకుడిగా ఎన్టీఆర్ నటించాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా