జక్కన్నతో పనిచేస్తున్నారు జాగ్రత్త.. చరణ్‌కి ఎన్టీఆర్ హెచ్చరిక

Published : Oct 21, 2020, 01:53 PM IST
జక్కన్నతో పనిచేస్తున్నారు జాగ్రత్త.. చరణ్‌కి ఎన్టీఆర్ హెచ్చరిక

సారాంశం

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌, రామ్‌చరణ్‌ నటిస్తూ అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్‌ని విడుదల చేశారు. తాజాగా కొమురంభీమ్‌ పాత్ర కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. దసరాని పురస్కరించుకుని రేపు(గురువారం) పదకొండు గంటలకు ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు. 

రామ్‌చరణ్‌ని హెచ్చరిస్తున్నారు ఎన్టీఆర్‌. రాజమౌళిని నమ్ముకుంటే మోసపోవచ్చని చెబుతున్నాడు. జక్కన్నతో పనిచేస్తున్నావ్‌ జాగ్రత్త అని సలహాలిస్తున్నాడు. మరి రామ్‌చరణ్‌కి ఎన్టీఆర్‌ హెచ్చరికలు చేయడానికి కారణమేంటి? ఎందుకు అలా చేస్తున్నాడనేది చూస్తే, 

ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్నారు. కొమురంభీమ్‌, అల్లూరి సీతారామరాజు యంగ్‌ ఏజ్‌లో లైఫ్‌ ఆధారంగా, కల్పిత కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్‌గా రూపొందిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో సినిమా తిరిగి షూటింగ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌, రామ్‌చరణ్‌ నటిస్తూ అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్‌ని విడుదల చేశారు. తాజాగా కొమురంభీమ్‌ పాత్ర కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. దసరాని పురస్కరించుకుని రేపు(గురువారం) పదకొండు గంటలకు ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం చిన్న ఇంట్రో సీన్‌ని రామ్‌చరణ్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఎన్టీఆర్‌ని ఉద్దేశించి `బ్రదర్‌ ఇది మీకోసం ` అని వెల్లడించారు. కానీ ఈ సారి కచ్చితంగా టైమ్‌కే అందిస్తాను అని తెలిపారు. అడవిలో నీటిలో నుంచి ఇరుసుని తీసుకుని ఎన్టీఆర్‌ పరిగెడుతున్నట్టుగా ఈ ఇంట్రో ఉంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

దీన్ని ఉద్దేశించి ఎన్టీఆర్‌ రీట్వీట్‌ చేశారు. `మీరు ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యం అయ్యిందని గ్రహించి ఉంటారు. మీరు పనిచేసేది జక్కన్నతో,కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏమైనా జరగొచ్చు` అని ఆనంద కన్నీళ్లతో కూడిన ఎమోజీని పంచుకున్నారు తారక్‌. అయినప్పటికీ చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్‌ చేస్తున్నానని తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు