
సినిమా తారలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇక తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాలపై మరింత ఫోకస్ పెడుతుంటారు. దానికి తగ్గట్లుగానే మన హీరోలు సైతం తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. అభయ్ పాలు తాగుతున్న ఫోటోను పోస్ట్ చేసి.. ''వాడు రోజు తాగాల్సిన పాల కోటాకు సంబంధించిన విషయంలో అభయ్ ను వాళ్ల అమ్మ నుండి కాపాడలేం'' అంటూ సరదాగా ఓ కామెంట్ పెట్టాడు. దీనిపై స్పందించిన కమెడియన్ వెన్నెల కిషోర్.. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ రిప్లై చేశాడు.