యంగ్ టైగర్  ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల చిత్రంలో పూజా హెగ్డే

Published : Mar 05, 2018, 03:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
యంగ్ టైగర్  ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల చిత్రంలో పూజా హెగ్డే

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ఎన్టీఆర్ 28 చిత్రంలో హిరోయిన్ గా పూజాహెగ్డే హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో  కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతోంది.

 

#NTR28 చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందిస్తుండగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తారు. 

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఏప్రిల్ లో ఈ  చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది. 

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, వంటి ఘనవిజయం సాధించిన  చిత్రాలను నిర్మించిన విషయం విదితమే.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-జ్యోను మనుమరాలే కాదన్న శివన్నారాయణ-నిజం తెలిసిపోయిందా?
అల్లు అర్జున్ కు జపనీయుల షాక్.. జపాన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 పరిస్థితి ఏంటో తెలుసా?