మరోసారి కలుస్తున్న ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌.. షూటింగ్‌ ఎప్పట్నుంచంటే?

Published : Apr 26, 2023, 09:51 PM IST
మరోసారి కలుస్తున్న ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌.. షూటింగ్‌ ఎప్పట్నుంచంటే?

సారాంశం

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `అరవింద సమేత` మూవీ వచ్చింది. మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది, కానీ సెట్‌ కాలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి కలుస్తున్నారనే వార్త వైరల్‌ అవుతుంది.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `అరవింద సమేత వీర రాఘవ` చిత్రం వచ్చింది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఆ ఫ్యాక్షన్‌లో చంపుకున్న తర్వాత అక్కడి ఫ్యామిలీస్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ ఫ్యాక్షన్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే లక్ష్యంతో హీరో పాత్ర ప్రధానంగా సాగే ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కానీ బ్లాక్‌ బస్టర్‌ రేంజ్‌కి చేరుకోలేదు. ఆ తర్వాత మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమాని ప్రకటించారు. త్రివిక్రమ్‌ `అల వైకుంఠపురములో` చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాల్సింది. దీన్ని అధికారికంగానూ ప్రకటించారు. 

కానీ కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఈ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. ఎన్టీఆర్‌.. కొరటాలకి కమిట్‌ కావడం, త్రివిక్రమ్‌ మహేష్‌బాబుతో కమిట్‌ అయ్యారు. అలా ఎన్టీఆర్‌,త్రివిక్రమ్‌ సినిమా బ్యాక్‌ అయ్యింది. మళ్లీ ఉంటుందనే వార్తలొచ్చాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యేలా లేదు. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్‌ సెట్‌ అయ్యిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. అంతేకాదు ఏకంగా షూటింగ్‌ లో కూడా పాల్గొనబోతున్నారట. అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

అయితే ఇది సినిమా కోసం కాదు, ఓ కమర్షియల్‌ యాడ్‌ కోసం ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారట. ఎన్టీఆర్‌ ఓ కమర్షియల్‌ యాడ్‌ చేస్తున్నారు. దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నారట. ఇది రేపు గురువారం షూటింగ్‌ జరుగుతుందని తెలుస్తుంది. గురువారం కాని, మరో రెండు మూడు రోజుల్లోగానీ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతుంది. మరి దీంట్లో నిజం ఎంతా అనేది చూడాలి. కానీ ఇది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. 

ప్రస్తుతం తారక్‌.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. `ఎన్టీఆర్‌30` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ఎన్టీఆర్‌తోపాటు జాన్వీ కపూర్‌ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఓ భారీ సెట్‌ కూడా వేశారని టాక్. మరోవైపు త్రివిక్రమ్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో `ఎస్ఎస్‌ఎంబీ28` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీలా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇది కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. యాడ్‌ కోసం అటు తారక్‌, ఇటు త్రివిక్రమ్‌ షూటింగ్‌ నుంచి గ్యాప్‌ తీసుకుంటున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు