క్రేజీ కాంబినేషన్.. కొహ్లీతో ఎన్టీఆర్!

Published : Jun 20, 2019, 09:56 AM IST
క్రేజీ కాంబినేషన్.. కొహ్లీతో ఎన్టీఆర్!

సారాంశం

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ లు కలిసి ఓ ప్రోగ్రాం చేయబోతున్నారనే విషయం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ లు కలిసి ఓ ప్రోగ్రాం చేయబోతున్నారనే విషయం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఓ అవేర్‌నెస్ ప్రోగ్రాం కోసం ఇద్దరూ కలిసి పనిచేయబోతుండడం విశేషం.

ఇంతకీ ఆ ప్రోగ్రాం ఏంటంటే.. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రముఖ టీవీ ఛానెల్ NDTV ఓ అవేర్‌నెస్ ప్రోగ్రాంను నిర్వహించనుంది.

ఇందులో భాగంగా ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి పని చేయబోతున్నారని టాక్. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ఏడుగురు సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా పని చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. 

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో