ఫ్యామిలీ, ఇండస్ట్రీ ప్రముఖుల కంటే ఫ్యాన్స్ కే ప్రయారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌..బర్త్ డే విషెస్‌పై ట్వీట్‌

Published : May 20, 2021, 06:51 PM IST
ఫ్యామిలీ, ఇండస్ట్రీ ప్రముఖుల కంటే ఫ్యాన్స్ కే ప్రయారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌..బర్త్ డే విషెస్‌పై ట్వీట్‌

సారాంశం

ఎన్టీఆర్‌కి బర్త్ డే విషెస్‌లు, సహాయాలు, కొత్త సినిమాల అప్‌డేట్లతో సోషల్‌ మీడియా మారుమోగింది. ఈ రోజు ట్విట్టర్‌ని ఎన్టీఆర్‌ ఏలేశారు. అభిమానులు ఇంతగా ప్రేమాభిమానాలు చాటడంతో ఎన్టీఆర్‌ స్పందించారు.

ఎన్టీఆర్‌ తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని తమ అపారమైన ప్రేమని కనబరిచిన ప్రతి ఒక్కరికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. నేడు(మే 20) యంగ్‌ టైగర్‌ తన 38వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. అలాగే అభిమానులు కూడా దూరంగా ఉండాలని, కరోనాతో బాధపడుతున్న వారికి సహాయం చేయాలని తెలిపారు. దీంతో ఆయన అభిమానులు దీన స్థితిలో ఉన్న వారికి సహాయం చేశారు. కొందరు అన్నదానం చేయగా, మరికొందరు కరోనా పేషెంట్లకి సంబంధించి ఆసుపత్రి, వైద్యం, ఆక్సిజన్‌, బెడ్స్ వంటివి అందించే ప్రయత్నం చేశారు. 

మొత్తంగా ఎన్టీఆర్‌కి బర్త్ డే విషెస్‌లు, సహాయాలు, కొత్త సినిమాల అప్‌డేట్లతో సోషల్‌ మీడియా మారుమోగింది. ఈ రోజు ట్విట్టర్‌ని ఎన్టీఆర్‌ ఏలేశారు. అభిమానులు ఇంతగా ప్రేమాభిమానాలు చాటడంతో ఎన్టీఆర్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. `నిండు మనసుతో నాకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, చిత్ర పరిశ్రమ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు` అని తెలిపారు. అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇందులో ఎన్టీఆర్‌ తన కుటుంబం, సినిమా ప్రముఖుల కంటే ముందు అభిమానులకే ప్రయారిటీ ఇవ్వడం విశేషం. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్టు రెండు రోజుల క్రితం తెలిపారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌.. రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటస్తున్నారు. కొమురంభీమ్‌గా ఇందులో ఆయన కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. అలాగే కొరటాల శివతో తన 30వ సినిమాని, `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో తన 31వ సినిమాని చేయబోతున్నట్టు ప్రకటించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది