డబ్బులున్న వారికే సాయం.. మతిపోయే కౌంటర్‌ ఇచ్చిన రేణు దేశాయ్‌

By Aithagoni RajuFirst Published May 20, 2021, 5:22 PM IST
Highlights

రేణు దేశాయ్‌ని ఉద్దేశించి ఓ నెటిజన్‌ విమర్శలు గుప్పించాడు. దీంతో రేణు దేశాయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. తనదైన స్టయిల్‌లో స్పందించి నెటిజన్‌ నోరు మూయించింది. 

డబ్బులున్న వారికే సాయం చేస్తున్నారని, కరోనా కాలంలో తమ లాంటి మధ్యతరగతి వారిని పట్టించుకోవడం లేదంటూ నటి, పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ని ఉద్దేశించి ఓ నెటిజన్‌ విమర్శలు గుప్పించాడు. దీంతో రేణు దేశాయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. తనదైన స్టయిల్‌లో స్పందించి నెటిజన్‌ నోరు మూయించింది. మరి ఆ సంగతేంటో చూస్తే, కరోనా కాలంలో సెలబ్రిటీలు చాలా మంది స్పందించి కరోనా బాధితులకు సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. అత్యవసరం  ఉన్న పేషెంట్లకి బెడ్స్, ఆక్సీజన్‌, వెంటిలేటర్స్ అందించేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. 

రేణు దేశాయ్‌ కూడా సోషల్‌ మీడియా ద్వారా కరోనా సమాచారాన్ని, అవసరం ఉన్న వారికి సహాయం అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ ఆమెని తప్పు పట్టాడు. `సాయం చేస్తున్నా అంటూ కేవలం ధనవంతులనే పట్టించుకుంటున్నార`ని విమర్శించాడు. మధ్య తరగతి వాళ్లకు సాయం చేయడం లేదని వాపోయాడు. డబ్బులు ఉన్నవాళ్లవే ప్రాణాలు కానీ మిడిల్‌ క్లాస్‌ వాళ్లవి ప్రాణాలు కాదా? అని విమర్శించాడు. ఆ మెసేజ్‌ని స్క్రీన్‌ షాట్‌ తీసిన రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని కౌంటర్‌ ఇచ్చింది. 

`గత పది, పన్నెండు రోజులుగా నాకు తోచిన సాయం చేస్తున్నాను. మీరు నన్ను ప్రశ్నించడానికి నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు. మీరు ఎన్నుకున్న లీడర్‌ని అసలే కాదు. ఇలాంటివి మీరు ఓటేసిన వ్యక్తుల్ని అడగాలి. కొందరు హెల్ప్ చేస్తారా? అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే మంచి చేయాలన్న నా లక్ష్యం దెబ్బతింటుంది. పొరపాటున సాయం కోసం చేసిన మీ మెసేజ్‌ని చూడలేకపోతే మరొకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఓవైపు సాయాన్ని అర్థిస్తూ సందేశాలతోపాటు, మరోవైపు పనికిరాని చెత్త మెసేజ్‌లతో నా ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. కాబట్టి ప్లీజ్‌, దయచేసి అర్థం చేసుకోండి` అని దిమ్మతిరిగేలా సమాధానం చెప్పింది. 

దీంతో ఇతర నెటిజన్లు స్పందిస్తూ రేణుకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. మీరు ధైర్యాన్ని, సాయం చేయాలనుకునే ఆలోచనని దయజేసి వదులుకోవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వారి కామెంట్లు పట్టించుకోవద్దని, మీరనుకున్నది చేసుకుంటూ వెళ్లండి అని చెబుతున్నారు. ఇక రేణు దేశాయ్‌..ప్రస్తుతం జీ తెలుగులో `డ్రామా జూనియర్స్ ` అనే షోకి హోస్ట్ గా చేస్తుంది.

click me!