'లక్ష్మీస్ ఎన్టీఆర్': వర్మ మరో సంచలన వీడియో!

Published : Mar 12, 2019, 01:11 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్': వర్మ మరో సంచలన వీడియో!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మార్చి 22న రాబోతున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మార్చి 22న రాబోతున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు.

సినిమాకు సంబంధించిన ట్రైలర్ లు, వీడియో సాంగ్స్ ఇలా ఒక్కొక్కటి విడుదల చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ సందేశం పేరుతో దర్శకుడు వర్మ మరో వీడియో విడుదల చేశారు.

''ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబు నాయుడు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పారు'' అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్టీఆర్ వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేశారు వర్మ. 'చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదూ.. నాకు అధికారం ఇచ్చిన మీకు.. నాకు ఓటేసిన ప్రజలకు' అంటూ ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎంతో ఆవేదనతో ప్రజలకు చెబుతుంటాడు.

'చంద్రబాబు గాడ్సే కన్నా అధముడు' అంటూ ప్రజాస్వామ్యం ఎవరికీ ఓటేస్తే బాగుంటుందో వారికే ఓటేయాలని సూచించారు.  

PREV
click me!

Recommended Stories

Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..
మహేష్ బాబు సంస్కారానికి ఫిదా అయిన హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ అంతలా ఏం చేశారు?