నేను నోరు విప్పితే.. బజారున పడతారు: ప్రియా ప్రకాష్

Published : Mar 12, 2019, 12:18 PM ISTUpdated : Mar 12, 2019, 12:21 PM IST
నేను నోరు విప్పితే.. బజారున పడతారు: ప్రియా ప్రకాష్

సారాంశం

కన్నుగీటి బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పై ఇటీవల చాలా విమర్శలు వినిపించాయి. ఆమె నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేశారు

కన్నుగీటి బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పై ఇటీవల చాలా విమర్శలు వినిపించాయి. ఆమె నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

కానీ ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త హైలైట్ అవుతూనే ఉంది. ముందుగా సినిమాలో మరో నటి నూరిన్ షరీఫ్.. ప్రియాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన కారణంగానే ఆమెని హీరోయిన్ గా తప్పించారని వాపోయింది.

ఆ తరువాత చిత్ర దర్శకుడు ఒమర్ లులు.. ప్రియాఅసలు హీరోయిన్ కాదని, నిర్మాతల బలవంతం మీద స్క్రిప్ట్ మార్చాల్సి వచ్చిందని, ప్రియాకి నటించడం రాదని విమర్శించారు. ఈ విషయాలపై తాజాగా స్పందించిన ప్రియా ప్రకాష్.. అసలేం జరిగిందో చెబితే తనను విమర్శిస్తున్న వారి పరువు పోతుందని చెప్పింది.

'తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనను విమర్శిస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుందని.. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని కామెంట్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Travel Movies: ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చుట్టేయండి.. ఈ 5 సినిమాలు చూస్తే చాలు!
Bigg Boss Telugu: నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్‌పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్, సోషల్ మీడియాలో కలకలం