
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్`(RRR) తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంతో ఆయనకు నేషనల్ వైడ్‌గా గుర్తింపు, పాపులారిటీ, క్రేజ్ వచ్చాయి. ఎలాంటి హంగామా లేకుండా బాలీవుడ్‌లో పాతుకుపోయాడు తారక్. ఆయనకు హిందీ మార్కెట్‌లో వచ్చిన క్రేజ్ మామూలు కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. ఆయనతో వర్క్ చేయాలనే ఆసక్తిని వెల్లడించారు.
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కలెక్షన్లు రాబట్టి ఇంకా రన్ అవుతుంది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో NTR హ్యాపీగా ఉన్నారు. అదే సమయంలో ఇందులో ఎన్టీఆర్ పాత్ర విషయంలో, ప్రాధాన్యత, హైలైట్ అయ్యే విషయంలో ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. తారక్‌కి అన్యాయం జరిగిందనే అభిప్రాయం ఫ్యాన్స్ నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్` నుంచి బయటపడి మరో సినిమాకు సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్.
తాజాగా ఆయన కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఎన్టీఆర్ ఆంజనేయుడి మాల ధరించారు. తాజాగా హనుమంతుడి మాలలో ఎన్టీఆర్ ఫోటో(NTR Anjaneya Swamy Deeksha) ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఎన్టీఆర్ కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన పూర్తి కొత్తగా కనిపిస్తున్నారు. ఓ గుడిలో అభిమానులతో ఫోటో దిగగా, దాన్ని వారు సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అయితే ఎన్టీఆర్ హనుమాన్ మాల ధరించబోతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. తన మొక్కులో భాగంగా ఫస్ట్ టైమ్ మాల ధరించబోతున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయన ఈ మాల ధరించారని టాక్. నేడు హనుమాన్ జయంతి. మరిఈ సందర్భంగానే ఆయన మాల ధరించడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.21 రోజులపాటు ఎన్టీఆర్ ఈ దీక్షలో ఉండబోతున్నట్టు సమాచారం. అనంతరం తన కొత్త సినిమాని ప్రారంభించడానికి ఆయన సిద్ధమవుతున్నారని టాక్.
ఎన్టీఆర్ నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ 30(NTR 30) గా రూపొందే ఈ చిత్రంలో అలియాభట్ కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెరకెక్కించబోతున్నట్టు టాక్. దీంతోపాటు `ఉప్పెన` ఫేమ్ బచ్చిబాబు డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేయనున్నారట తారక్. ఈ రెండు చిత్రాలను ఏకకాలంలో తెరకెక్కించాలని భావిస్తున్నారట. మరోవైపు `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్‌తోనూ ఓ కమిట్‌మెంట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభించేందుకు ప్లాన్ జరుగుతుందని ఫిల్మ్ నగర్ టాక్.