హాలీవుడ్‌ రిపోర్టర్‌కి ఎన్టీఆర్‌ బర్త్ డే సర్‌ప్రైజ్‌.. షాక్‌లో విలేకరి.. ఏంచేశాడంటే?

Published : Jan 11, 2023, 12:41 PM ISTUpdated : Jan 11, 2023, 01:26 PM IST
హాలీవుడ్‌ రిపోర్టర్‌కి ఎన్టీఆర్‌ బర్త్ డే సర్‌ప్రైజ్‌.. షాక్‌లో విలేకరి.. ఏంచేశాడంటే?

సారాంశం

లాస్‌ ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డు ఈవెంట్‌లో చిత్ర బృందంతోపాటు ఎన్టీఆర్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ హాలీవుడ్‌ రిపోర్టర్‌తో ముచ్చటించాడు ఎన్టీఆర్‌. ఆ విలేకరికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

తెలుగు ప్రతిష్టాత్మక మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌` అంతర్జాతీయంగా సత్తా చాటుతుంది. ఇండియన్‌ సినిమాకి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. తాజాగా ఈ మూవీ ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు పాటకి అంతర్జాతీయ పురస్కారం రావడం ఇదే తొలిసారి. ఇదొక రికార్డ్. ఇది ఇండియన్‌ రికార్డ్ కూడా. `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని `నాటు నాటు` పాటకి గానూ ఈ పురస్కారం దక్కింది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు. దీంతో కీరవాణికి, `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది ఇండియన్‌ సినిమా గర్వపడే సందర్భంగా అభివర్ణిస్తున్నారు. 

ఇదిలా ఉంటే లాస్‌ ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డు ఈవెంట్‌లో చిత్ర బృందంతోపాటు ఎన్టీఆర్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ హాలీవుడ్‌ రిపోర్టర్‌తో ముచ్చటించాడు ఎన్టీఆర్‌. `వెరైటీ` అనే మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్‌లో అదరగొట్టారు. హాలీవుడ్‌ యాక్టర్‌ స్టయిల్‌లో ఆయన మాట్లాడుతుంటే ముచ్చటేసిందని చెప్పొచ్చు. ఆ స్లాంగ్‌, ఆ స్పీడ్‌ వాహ్‌ అనిపించేలా ఉంది. ఎన్టీఆర్ మాటలకు ఆ రిపోర్టర్‌ సైతం ఆశ్చర్యపోయాడు. `నాటు నాటు` పాటకి అవార్డు రావడం పట్ల తారక్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది తాము ఊహించలేదని, ఎవరూ ఊహించి ఉండరని తెలిపారు. ఇది అవార్డుని మించిన ఆనందమని తెలిపారు. రాజమౌళితో పనిచేయడంపై తన హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకున్నారు. 

చివరగా ఆ రిపోర్టర్‌కి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు తారక్‌. ఆ రిపోర్టర్‌ పుట్టిన రోజు నేడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరీ బర్త్ డే విశేష్‌ చెప్పారు. ఊరికే మాటల్లో విషెస్‌ కాదు, ఓ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చి మరీ విషెస్‌ చెప్పడం విశేషం. దీంతో తారక్‌ ఇచ్చిన గిఫ్ట్ చూసి నోరెళ్లబెట్టాడు ఆ సదరరు రిపోర్టర్‌. ఆ వెంటనే ఆనందం తట్టుకోలేక ఎన్టీఆర్‌ని హగ్‌ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా వైరల్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ గొప్ప మనసుని అభినందిస్తున్నారు నెటిజన్లు, అభిమానులు. 

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కొమురంభీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఓ ఫిక్షన్‌ కథతో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని రూపొందించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?