షాట్‌లో చిన్నప్పుడు ఎన్టీఆర్‌ని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. సీనియర్‌ నటి శారదతో ఉన్న రేర్‌ వీడియో వైరల్‌..

Published : Jun 23, 2024, 01:01 PM IST
షాట్‌లో చిన్నప్పుడు ఎన్టీఆర్‌ని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. సీనియర్‌ నటి శారదతో ఉన్న రేర్‌ వీడియో వైరల్‌..

సారాంశం

ఎన్టీఆర్‌ చిన్ననాటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇందులో షాట్‌లో ఉన్నాడు తారక్‌. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.   

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. రెండు పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.  ప్రస్తుతం `దేవర` షూటింగ్‌లో ఉన్నాడు. దీంతోపాటు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్నారు. ఈ సినిమాలతో తారక్‌ రేంజ్‌ అమాంతం పెరగబోతుంది. తెలుగులోనే కాదు, ఇండియా వైడ్‌గా తన ఇమేజ్‌ని, మార్కెట్‌ని పెంచుకోబోతున్నాడు. అందుకోసం ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి సంబంధించి ఓ చిన్ననాటి అరుదైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అటు ఇటుగా ఎన్టీఆర్‌ పది, 12ఏళ్ల వయసులోని వీడియో అది. ఓ మ్యూజికల్‌ కాన్సర్ట్ లో ఆయన పాల్గొన్నాడు. తను కూడా షో చేసినట్టు తెలుస్తుంది. చిన్నప్పుడు ఎన్టీఆర్‌ క్లాసికల్‌ డాన్స్ నేర్చుకున్నారు. భారతనాట్యంలో మంచి పట్టు ఉంది. అంతేకాదు కొన్ని షోస్‌ లో పర్‌ఫెర్మ్‌ కూడా చేశాడు. అందులో భాగంగా ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియోలోనూ చిన్ననాటి తారక్‌ తన ప్రదర్శన ఇచ్చినట్టు తెలుస్తుంది. తన చేతులకు కోన్‌ కనిపిస్తుంది. 

అయితే ఆయన స్టేజ్‌ ముందు సీనియర్‌ నటి శారద పక్కన కూర్చోవడం విశేషం. సీనియర్‌ ఎన్టీఆర్‌ మనవడు కావడంతో తారక్‌ని పక్కన కూర్చోబెట్టుకుంది శారద. ఇందులో ఈ ఇద్దరు ముచ్చట్టు పెట్టుకుంటున్నారు. శారద ఏదో అడిగితే అవును అనేలా తలూపాడు ఎన్టీఆర్‌. చిన్నప్పుడు ఎంతో క్యూట్‌గా ఉన్నాడు. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్‌ షాట్‌లో కనిపించాడు. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఆయన హవభావాలు, స్పాంటినియస్‌గా రెస్పాండ్‌ అయ్యే విధానం, కళ్లు నలుచుకుంటూ కనిపించిన తీరు ఫన్నీగా ఉంది. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. దీంతో వాళ్లు వైరల్‌ చేస్తున్నారు. 

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ `దేవర` షూటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. థాయ్‌లాండ్‌లో ఈ మూవీ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతుంది. తారక్‌, జాన్వీలపై ఈ పాట షూట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌ సారథ్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్‌తో ఈ పాట చేయడం చాలా ఆనందంగా, ఎగ్జైటింగ్‌గా ఉందని ఆ కొరియోగ్రాఫర్‌ వెల్లడించారు. ఇక ఈ మూవీని సెప్టెంబర్‌ 27న విడుదల చేయబోతున్నారు. మరోవైపు `హృతిక్‌ రోషన్‌తో కలిసి `వార్‌ 2`లోనూ నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్‌ లో ఆయన పాల్గొన్నాడు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి