నితిన్‌ `చెక్‌`కి బెస్ట్ విషెస్‌ తెలిపిన కొమురంభీమ్‌

Published : Feb 25, 2021, 04:56 PM IST
నితిన్‌ `చెక్‌`కి బెస్ట్ విషెస్‌ తెలిపిన కొమురంభీమ్‌

సారాంశం

నితిన్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చెక్‌`. క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్ర శేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రేపు శుక్రవారం(ఫిబ్రవరి 26న) సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి ఎన్టీఆర్‌ బెస్ట్ విషెస్‌ తెలిపారు.

నితిన్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చెక్‌`. క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్ర శేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రేపు శుక్రవారం(ఫిబ్రవరి 26న) సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన దర్శకధీరుడు రాజమౌళి అభినందనలు తెలియజేశారు. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు, థియేటర్‌లోనే సినిమాని చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. వరుణ్‌ తేజ్‌ సైతం అభినందనలు తెలియజేశారు. 

తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్‌ అందజేశారు. ముఖ్యంగా దర్శకుడు చంద్ర శేఖర్‌ యేలేటికి తన ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు ఎన్టీఆర్‌. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. `ప్రత్యేకమైన ఇతివృత్తాలు, డిఫరెంట్‌ స్టోరీస్‌ని చెప్పే చంద్రశేఖర్‌ యేలేటి గారికి నేను ఎప్పుడూ అభిమానినే. `చెక్‌` చాలా ఇంట్రెస్టింగ్‌గా  అనిపిస్తుంది. చంద్రశేఖర్‌యేలేటి, హీరో నితిన్‌, ఇతర చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్‌` అని తెలిపారు ఎన్టీఆర్‌. 

ఇదిలాఉంటే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సంపత్‌ రాజ్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు. తనది ఇందులో పోలీస్‌ పాత్ర అని, హీరోకి ఉరిశిక్ష పడాలనే లక్ష్యంతో ఉండే పాత్ర తనదని వెల్లడించాడు. ఇందులో తన పాత్ర చాలా స్పెషల్‌గా నిలుస్తుందన్నారు. `లౌక్యం` సినిమా విజయంసాధించినప్పుడు నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌ యాపిల్‌ ఐ ఫోన్‌ గిఫ్ట్ గా ఇచ్చారని, ఈ సినిమా విజయం సాధించాలని, ఆనంద్‌ ప్రసాద్‌ తమకి ఐ ఫోన్‌ కంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పారు. `చెక్‌` క్లైమాక్స్ బాగుంటందన్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?