RRR: ఆ భాష ఒక్కటే ఇబ్బంది పెట్టింది... కూనీ చేస్తున్నామేమో అనిపించిందన్న తారక్...

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 11, 2021, 11:32 AM IST
RRR:  ఆ భాష ఒక్కటే ఇబ్బంది పెట్టింది... కూనీ చేస్తున్నామేమో అనిపించిందన్న తారక్...

సారాంశం

ట్రిపుల్ ఆర్ సినిమా డబ్బింగ్ విషయంలో ఒక్క భాష మాత్రమే భాయపెట్టిందన్నారు ఎన్టీఆర్. మిగతా నాలుగు భాషల్లో మాత్రం డబ్బింగ్ చెప్పుకున్నామన్నారు.   

ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది ట్రిపుల్ ఆర్ మూవీ. తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ ఐదు భాషలు కాక మరో ఐదు భాషల్లో డబ్బింగ్ చేయబడి రిలీజ్ అవుతుంది ట్రిపుల్ ఆర్. అయితే మెయిన్ గా రిలీజ్ అవుతున్న ఐదు భాషల్లో.. నాలుగు భాషలకు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే వారిద్దరికి ఒక భాష మాత్రమే ఇబ్బంది పెట్టిందన్నారు తారక్. 

ఈరోజు జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో తారక్ మాట్లాడుతూ..తెలగు,తమిళ,కన్నడ, హిందీ భాషల్లో తామే డబ్బింగ్ చెప్పుకున్నామన్నారు. కాని మలయాళం మాత్రం వర్కౌట్ అవ్వలేదన్నారు ఎన్టీఆర్. ఆ భాషలో కూడా డబ్బింగ్ చెప్పడానికి ట్రై  చేశామని.. ఆ డబ్బింగ్ శాంపిల్స్ విని రాజమౌళి... అనవసరంగా ఆ భాషను కూనీ చేస్తున్నట్టు అనిపించిందనుకోండంతో... మలయాళం లో డబ్బింగ్ చెప్పకుండా డ్రాప్ అయ్యామన్నారు తారక్. 

మిగతా నాలుగు భాషల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బింగ్ చెప్పుకున్నామన్నామన్నారు యంగ్ టైగర్. హైదరాబాద్ లో పుట్టి పెరడగడం వల్ల హిందీ ఇబ్బంది లేకుండా పోయింది. ఇండస్ట్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్నాం కాబట్టి తమిళ్, కన్నడ పై అవగాహన ఉంది. ఆ ధైర్యంతోనే ఈ మూడు భాషల్లో తమ సొంత గొంతులే పలికించామన్నారు. ఎక్కడా తేడా రాకుండా ఫుల్  ప్రిపేర్డ్ గా... డబ్బింగ్ పనులు పూర్తి చేశామన్నారు. 

దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో... పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది ట్రిపుల్ ఆర్ సినిమా. ప్రపంచ వ్యాప్తగా సక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతోంది మూవీ. రాజమౌళి దర్శకత్వంలో... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. రామ్ చరణ్ కు జంటగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ కు జంటగా హాలీవుడ్ స్టార్ ఒలీవియా నటించారు.బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ .. శ్రీయా.. సముద్రఖని లాంటి స్టార్స్ నటించిన ఈమూవీని డివివి దానయ్య నిర్మించారు. 

Also Read: RRR Movie: టికెట్ ధరల కోసం ఎన్టీఆర్ హెల్ప్ తీసుకుంటున్న దానయ్య.. ఎందుకో తెలుసా ?

PREV
click me!

Recommended Stories

Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Balan Movie review: బాలన్‌ మూవీ రివ్యూ.. తల్లీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?