తారక్ చేయిపడితే అంతే... అన్ని మంచి శకునములే ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

Published : May 12, 2023, 07:37 PM ISTUpdated : May 12, 2023, 07:45 PM IST
తారక్ చేయిపడితే అంతే... అన్ని మంచి శకునములే ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

సారాంశం

అన్నీ మంచి శకునములే టీమ్ కు అభినందనలు తెలిపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఆయన మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

రిలీజ్ కు రెడీ అవుతోంది అన్నీ మంచి శకునములే సినిమా. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ వీడియోస్ తో పాటు.. రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇక ఈమూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ను గ్లోబల్ స్టార్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేధికగా రిలీజ్ చేశారు. 

అన్నిమంచి శకునములే ట్రైలర్‌ని.. తన ట్విట్టర్ లో  షేర్ చేసిన ఎన్టీఆర్ మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నందకు నాకు చాలా సంతోషంగా ఉంది! అన్నారు ఎన్టీఆర్. కొత్త కథలు, సృజనాత్మక సినిమాలు రూపొందించడంలో.. హృదయాలను కదిలించే వ్యాక్తులు.. నా స్నేహితురాలు స్వప్నకు, మంచి కథను ఎంచుకున్న ప్రియాంకకు.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ నందిని గార్లకు ఆల్ దిబెస్ట్.. సినిమాలో నటించిన అందరికి శుభాంకాక్షలు అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. 

 

తన ట్వీట్ కు అన్నిమంచి శకునములే మూవీ ట్రైలర్ లింక్ ను జతచేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ట్వీట్ తో పాటు.. ఈ మూవీ ట్రైలర్ కూడా దూసుకుపోతోంది. ఇక ఇంతకు ముందే ఈ ట్రైలర్ రిలీజ్ గురించి వైజయంతీ మూవీస్ ప్రకటించారు. తారక్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారంటూ.. కాస్త డిఫరెంట్ గా ప్రకటించారు. మే 12 వ తేదీ సాయంత్రం 5 గంటలకు అన్ని మంచిశకునములే ట్రైలర్ తారక్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు వైజయంతీ టీమ్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిఇక్కడే కలిసిన మనకు అన్నీ మంచి శకునములే.. మా తారక రాముడికి చేరిన చల్లని చిరుగాలి అంటూ ఎన్టీఆర్
మ్యాషప్ వీడియోను పంచుకున్నారు. 

 

ఇక సరిగ్గా ఈరోజు టైమ్ కు తారక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేయడంతో... తారక్ హ్యాండ్ పడితే..నిజంగా మంచి శకునములే సంతోష్ హిట్ అందుకున్నట్లే అని అభిమానులు హామీ ఇస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల నడుమ అన్ని మంచి శకునములే సినిమా  మే 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మరి ఈసినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 


 

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ