ఎన్టీఆర్ కాదన్న కథ ఇదేనట!

Published : Aug 12, 2018, 01:13 PM ISTUpdated : Sep 09, 2018, 12:24 PM IST
ఎన్టీఆర్ కాదన్న కథ ఇదేనట!

సారాంశం

ఆ తరువాత దిల్ రాజు కూడా మాస్ హీరోతో ఈ కథ చేయించాలంటే కొన్ని విషయాల్లో రాజీపడాలని నితిన్ ని హీరోగా ఫైనల్ చేసుకున్నాడట. నిజానికి దిల్ రాజు.. ఎన్టీఆర్ తరువాత రామ్ చరణ్ తో చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడట

'శతమానంభవతి' సినిమా సక్సెస్ అయిన తరువాత దర్శకుడు సతీష్ వేగ్నేశతో తన బ్యానర్ లో మరో సినిమా చేయాలనుకున్నాడు దిల్ రాజు. స్టార్ హీరోతో సినిమా చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఇందులో భాగంగా ముందుగా ఎన్టీఆర్ ని కలిసి కథ వినిపించాడు. ఆ కథ మరేదో కాదు.. నితిన్ నటించిన 'శ్రీనివాస కళ్యాణం'. కథ విన్న తరువాత ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డాడు.

ఆ తరువాత దిల్ రాజు కూడా మాస్ హీరోతో ఈ కథ చేయించాలంటే కొన్ని విషయాల్లో రాజీపడాలని నితిన్ ని హీరోగా ఫైనల్ చేసుకున్నాడట. నిజానికి దిల్ రాజు.. ఎన్టీఆర్ తరువాత రామ్ చరణ్ తో చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడట. కానీ నితిన్ కి కథ నచ్చి సినిమా చేస్తానని ముందుకు రావడంతో అతడితో సినిమాను రూపొందించారు. వాస్తవానికి స్టార్ హీరోలు యాక్సెప్ట్ చేసే అంశాలు ఈ సినిమాలో లేవు. అయినప్పటికీ దిల్ రాజుని కాదనలేక ఎన్టీఆర్ కథ విన్నాడు.

ఇప్పుడు సినిమా రిజల్ట్ ఎలాగో తెలిసిపోయింది. మొదటి షో నుండే నెగెటివ్ టాక్ వస్తున్నప్పటికీ చిత్రబృందం మాత్రం సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంది. మా సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని కానీ ఇప్పుడు కలెక్షన్లు పుంజుకున్నాయని దిల్ రాజు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ డెబ్భై శాతం బయ్యర్లు లాస్ రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకుల అంచనా!

PREV
click me!

Recommended Stories

ఘనంగా అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..బాలయ్య నుంచి డైరెక్టర్ అట్లీ వరకు, తరలివచ్చిన ప్రముఖులు
సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ.. విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం