
తను రెడీ చేసిన క్యారెక్టర్‌ని ఎన్టీఆర్ కాపీ కొట్టాడని.. పూరీ జగన్ న్యూస్ లీక్ చేసాడంటూ కొత్త రూమర్ తెగ సర్కులేట్ అవుతోంది. ఇంతకీ జగన్ లీక్ చేసాడా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు గానీ.. ఇప్పటికే నందమూరి అభిమానుల్లోని రెండు వర్గాల్లో మంటలు రాజుకున్నాయి. అసలు పూరీ స్క్రిప్ట్ ని కాపీ కొట్టాల్సిన అవసరం తారక్ కు లేదని జూనియర్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ప్రస్థుతం బాలయ్య పైసా వసూల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పూరీకి న్యాయం జరగాలని బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ అభిమానులపై కాలు దువ్వుతున్నారు.
అభిమానుల మధ్య ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ స్క్రిప్ట్ దొంగిలించాడనే వ్యవహారం మీద నిన్నటినుంచీ టాలీవుడ్ అంతా హాట్ హాట్ చర్చ నడిచింది. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న పూరి ఓ స్టోరీని, కేరక్టరైజేషన్‌ను ఎన్టీఆర్‍కు వినిపించాడని, తాను చెప్పినటువంటి పాత్రను పోలిన విధంగా జై లవకుశ పాత్ర ఉండటంతో పూరి షాకయ్యాడని, ఎన్టీఆర్ తాను చెప్పిన పాత్రనే దొంగిలించాడనే అనుమానంలో పూరీ పడిపోయారని ఓ ఆంగ్లపత్రికలో కథనం వచ్చింది. ఇక అక్కడ మొదలైన గొడవ ఫ్యాన్స్ మధ్య వార్ కు తెర లేపింది.
అసలు ఈ వార్త ఇండస్ట్రీ నుంచి బయటకు ఎలా పొక్కిందనే విషయం అప్పడు తెలియకపోయినా.. పూరీకి క్లోజ్‌గా ఉండే ఓ హీరోయినే ఇలా చేస్తోందని తాజా టాక్. బాలయ్యతో ‘పైసా వసూల్' సెట్లో ఉన్న పూరీ జగన్నాథ్ ‘జై' టీజర్ చూశాక ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ గురించి తాను ఇదివరకే ఎన్టీఆర్‌తో చెప్పానని, అయితే అప్పుడు ఎన్టీఆర్ ఏ విషయమూ చెప్పలేదని పూరీ జగన్నాథ్ చెప్పినట్లు ఆ హీరోయిన్ పుకార్లు పుట్టించిందట.
మరి పూరీకి అంత క్లోజ్ గా ఉండే హీరోయిన్, అదీ బాలయ్య సినిమా చేస్తున్న సమయం లో మీడియాకి ఇలాంటి లీక్ ఇవ్వగల చనువు ఉండే హీరోయిన్ ఎవరబ్బా అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. మరి పూరీకి సన్నిహితంగా ఉన్న హీరోయిన్ చార్మీ కి ఈ వివరాలేమైనా తెలుసా అంటే అదీ ఖచ్చితంగా చెప్పలేం. అయితే అసలు ఈ వివాదానికి తెరలేపిన ఆ హీరోయిన్ చార్మీనే అన్న రూమర్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ పుకారు ఎక్కడి నుంచి లీకైందనేది తేలాల్సి వుంది.