ఎన్టీఆర్ మహానాయకుడు వచ్చేది ఎప్పుడంటే?

Published : Dec 19, 2018, 07:02 PM IST
ఎన్టీఆర్ మహానాయకుడు  వచ్చేది ఎప్పుడంటే?

సారాంశం

విశ్వవిఖ్యాత నటుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బయోపిక్ పై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో స్పెషల్ గీతా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదలైన కీరవాణి పాటలు కూడా సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేశాయి. 

విశ్వవిఖ్యాత నటుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బయోపిక్ పై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో స్పెషల్ గీతా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదలైన కీరవాణి పాటలు కూడా సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇకపోతే సినిమా సెకండ్ పార్ట్ మహానాయకుడు రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ కొత్త డేట్ ను ఎనౌన్స్ చేసింది. 

సినిమాకు సంబందించిన ఎదో ఒక పోస్టర్ తో రోజు హల్చల్ చేస్తోన్న ఎన్టీఆర్ టీమ్ నేడు సెకండ్ పార్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. అందులో మహానాయకుడు ఫిబ్రవరి 7న రానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అసలైతే జనవరి ఎండింగ్ లోనే ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. ఇక కథానాయకుడు సంక్రాంతి కానుకగా రానున్నట్లు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. జనవరి 9న ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతోంది. 

ఇక సినిమాకు సంబందించిన ఆడియో లాంచ్ ట్రైలర్ లంచ్ ను ఒకేసారి జరపనున్నారు. డిసెంబర్ 21న ఫిల్మ్ నగర్ లోని జెఆర్సి కన్వెన్షన్ హల్ లో ఈవెంట్ ను నిర్వహించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సాయి కొర్రపాటి - బాలకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.  

PREV
click me!

Recommended Stories

Suma Kanakala : రోడ్డు మీద బుక్స్ అమ్మే వాడిలా ఉన్నావు.. స్టార్ డైరెక్టర్ ను అవమానించిన యాంకర్ సుమ
Karthika Deepam 2 Today Episode: దాసును ఆపిన కార్తీక్- తప్పించుకున్న జ్యో- విడాకులకు సిద్ధమైన స్వప్న