
జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త! ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న వారి కోరిక తీరే రోజు రానే వస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీన ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభం కానుంది. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న గ్రాండ్ గా ఓపెనింగ్ చేయడానికి సుముహూర్తం నిర్ణయించారు . ఎన్టీఆర్ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.
ఎన్టీఆర్ నటించనున్న ఈ చిత్రానికి జై లవకుశ గా నామకరణం చేసారు. జనతా గ్యారేజ్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ స్వల్ప విరామం తర్వాత ఈ చిత్రంలో నచించనున్నారు. కాగీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ని ఆర్ధికంగా నిలబెట్టడానికి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు . మరి కళ్యాణ్ రామ్ ఏ మేరకు లాభాలు ఆర్జిస్తాడో చూడాలి.