బాబాయ్‌ బాలయ్యకి అబ్బాయిలు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ బర్త్ డే విషెస్‌

Published : Jun 10, 2021, 08:59 AM IST
బాబాయ్‌ బాలయ్యకి అబ్బాయిలు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ బర్త్ డే విషెస్‌

సారాంశం

మాస్‌ సినిమాలతో మెప్పిస్తున్న బాలయ్య నేడు(జూన్‌ 10)తన 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆయనకి అనేక సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ.. నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ నటన వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఆయన లెగసీని నేటి తరానికి అందిస్తున్నారు. క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల ఆడియెన్స్ ని అలరించడంలో దిట్ట బాలయ్య. ఇప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మాస్‌ సినిమాలతో మెప్పిస్తున్న బాలయ్య నేడు(జూన్‌ 10)తన 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆయనకి అనేక సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

వారిలో ముందున్నాడు అబ్బాయి ఎన్టీఆర్‌. బాబాయ్‌కి ఎర్లీ మార్నింగ్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు. `జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్‌. మరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను` అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా బాబాయ్ బాలయ్యది ఓ అరుదైన ఫోటోని పంచుకున్నారు ఎన్టీఆర్‌. మరోసారి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. మరో అబ్బాయి కళ్యాణ్‌ రామ్‌ సైతం `మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల`ని బర్త్ డే విషెస్‌ తెలిపారు.

వీరితోపాటు అనేక సినీ ప్రముఖులు బాలకృష్ణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుధీర్‌బాబు, హీరో శ్రీకాంత్‌, నిర్మాత కోన వెంకట్‌, నారా రోహిత్‌, బాలయ్య కూతురు నారా బ్రహ్మణి, దర్శకుడు సంపత్‌ నంది, తనతో నెక్ట్స్ సినిమా చేయబోతున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని, అలాగే పలు నిర్మాణ సంస్థలు బర్త్ డే విషెస్‌ తెలిపాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌