సోనూ సూద్ సంచలన నిర్ణయం... దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు!

By team teluguFirst Published Jun 9, 2021, 8:21 PM IST
Highlights

కోవిడ్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోగా ఆసుపత్రులలో ఆక్సిజన్ అందుబాటులో లేక వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సోనూ సూద్ సిద్ధం అవుతున్నారు. 

కోవిడ్ -19 మహమ్మారి సంక్షోభ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి సోను సూద్ ప్రయత్నిస్తున్నారు. కోవిడ్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోగా ఆసుపత్రులలో ఆక్సిజన్ అందుబాటులో లేక వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సోనూ సూద్ సిద్ధం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరు ప్రాంతాలలో పాటు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో మొదటగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనున్నట్లు సోనూ సూద్ తెలిపారు. 

ఆ తరువాత  పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ ఇలా అన్నిరాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లను  ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ,  సోను సూద్ గురించి మాట్లాడుతూ “గత కొన్ని నెలల్లో మనమందరం ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య ఆక్సిజన్. అది  అందుబాటులో లేకపోవడం వలన అనేక ప్రాణాలు పోయాయి. ఈ ఆక్సిజన్ సమస్యను  మూలాల నుండి నిర్మూలించడానికి, ఏమి చేయాలో నా బృందం మరియు నేను ఆలోచించాము.  సాధ్యమైనంత ఎక్కువ ప్రదేశాలలో మొత్తం ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాము'' అన్నారు. 
 

సోను సూద్ ఇంకా మాట్లాడూతూ, “ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఎక్కువగా పేద ప్రజలకు ఉచిత చికిత్స అందించే ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు వ్యవస్థాపించబడటంతో, ఆక్సిజన్ వంటి ప్రాథమిక అవసరం లేకపోవడంతో దేశంలో ఒక్క వ్యక్తి కూడా మరణించకుండా చూసుకోవడం మా లక్ష్యం. ఈ కష్ట సమయాల్లో అందరం కలిసి వచ్చి పేదవారికి చేయి అందిద్దాం'' అన్నారు. 
 

Lets PLANT.🌱
OXYGEN❤ plants across India.🇮🇳 🇮🇳 pic.twitter.com/AyPN4fVByu

— sonu sood (@SonuSood)
click me!