NTR : తారక్ అరుదైన ఘనత.. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబర్ గా జూ.ఎన్టీఆర్..

By Asianet News  |  First Published Oct 19, 2023, 12:28 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో మెంబర్ గా ఎంట్రీ ఇచ్చి అంతర్జాతీయంగా మరో గౌరవం అందుకున్నారు.
 


మ్యాన్ ఆఫ్ మాసెస్ మరియు గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR) కు అకాడమీ (Oscar)  అరుదైన గౌరవాన్ని అందించింది.  ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పేరు ‘ఆస్కార్ వేడుకలు 2023’ సందర్భంగా  ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన విషయం తెలిసిందే.  ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీంగా ఆయన నటన గ్లోల్ ఆడియెన్స్ లో మరింత క్రేజ్ ను పెంచింది.

అంతర్జాతీయంగా పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకున్నారు. దాంతో పాటు హాలీవుడ్ దర్శకులు, నటీనటులు, బాలీవుడ్ దర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో తారక్ స్థాయి మరింతగా పెరిగింది. దీనికి తోడు తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు. 

Latest Videos

undefined

ది అకాడమీ (ఆస్కార్) కొత్త మెంబర్స్ లిస్ట్ ను ఈరోజు ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్ కు చోటుదక్కడం విశేషం. యాక్టర్స్ బ్రాంచ్ మెంబర్ గా ఎన్టీఆర్ ను అకాడమీ ఆహ్వానించి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. దీంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోకు అంతర్జాయతీయంగా గుర్తింపు దక్కడం ఆనందంతో పొంగిపోతున్నారు. తారక్ పేరును నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. అలాగే ఈ జాబితాలో పలువురు హాలీవుడ్ యాక్టర్స్ కూడా చోటు దక్కింది.

ఇక గతంలోనూ అకాడెమీ కొత్త సభ్యులతో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఇండియా నుంచి ఎనిమిది మందికి చోటు దక్కింది. ఇందులో ఆరుగురు RRR టీమ్ సభ్యులే ఉండటం విశేషం. ఇక గతేడాది ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఓరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డును ఎంఎం కీరవాణి, చంద్రబోస్ స్వీకరించిన విషయం తెలిసిందే. 

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న War2 చిత్ర షూటింగ్ కూడా నిన్నే ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఎన్టీఆర్ 31కూడా మొదలు కాబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

click me!