ఎన్టీఆర్ 'జై లవ కుశ' మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..అదిరింది

Published : Apr 05, 2017, 12:43 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఎన్టీఆర్ 'జై లవ కుశ' మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..అదిరింది

సారాంశం

శ్రీరామ నవమి సందర్భంగా జై లవ కుశ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ  

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జై లవ కుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సోదరుడు, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ లుక్ విషయంలో సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూ ఫస్ట్ లుక్లో కేవలం టైటిల్ లోగోను మాత్రమే రివీల్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

పాకిస్థాన్‌లో ధురంధర్ దూకుడు.. బ్యాన్ చేసినా కూడా ఓటీటీలో ఎగబడి చూస్తున్నజనం, కారణం ఏంటి?
ధనుష్ చెల్లెలుగా మృణాల్ ఠాకూర్? ఇదేం కొత్త ట్విస్ట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్