త్వరలో అఖిల్ మాజీ ప్రియురాలు శ్రియా భూపాల్ పెళ్లి

Published : Apr 05, 2017, 09:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
త్వరలో అఖిల్ మాజీ ప్రియురాలు శ్రియా భూపాల్ పెళ్లి

సారాంశం

త్వరలో అఖిల్ మాజీ ప్రియురాలు శ్రియా భూపాల్ పెళ్లి ఎన్నారై వరున్ని ఓకే చేసినట్లు సమాచారం శ్రియ కూడా ఓకే చెప్పిందని వార్తలు

అఖిల్-శ్రియాభూపాల్ పెళ్లి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. చిన్న వయసులోనే అక్కినేని అఖిల్‌ తన కంటే పెద్దదైన జీవీకే మనవరాలు శ్రీయభూపాల్‌తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడి నిశ్ఛితార్థం కూడా చేసుకున్నారు. పెళ్లి కాస్త క్యాన్సిల్ అవ్వడం తెలిసిన సంగతే. అఖిల్‌-శ్రీయ బ్రేకప్‌ గురించి నెల రోజుల క్రితమే వార్తలు వచ్చినా..ఇప్పటివరకు ఈ విషయం గురించి ఇరు కుటంబసభ్యులలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు,ఈ వార్తను ఖండించకుండా, ఆమోదించకుండా అందరూ సైలెన్స్‌ మెయింటెన్‌ చేస్తున్నారు.

మరో పక్క అఖిల్ శ్రియా భూపాల్ ల మధ్య రామ్ చరణ్ సతీమణి ఉపాసన రాయబారం కొంత కాలం నడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. ఉపాసన ఎంత చెప్పినా... అఖిల్ తో సంబంధం నిలబెట్టుకునేందుకు అంగీకరించలేదట. 

 

తాజాగా శ్రియకు మరో పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అఖిల్‌తో పెళ్లి డ్రాప్ అనుకున్న తరువాత శ్రియా తల్లితండ్రులు ఆమెకు ఓ ఎన్నారై సంబంధం చూసినట్లు తెలుస్తోంది. సదరు ఎన్నారై కుర్రాడిని పెళ్లి చేసుకోవడానికి శ్రియ కూడా సిద్ధంగా ఉందని టాక్.

PREV
click me!

Recommended Stories

Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..