#NTR: వెలుగు ప్రవాహంలోకి...ఎన్టీఆర్? ఆ సూపర్ హిట్ ప్రీక్వెల్ లో

Published : Mar 08, 2024, 05:50 PM IST
#NTR: వెలుగు ప్రవాహంలోకి...ఎన్టీఆర్?  ఆ సూపర్ హిట్  ప్రీక్వెల్ లో

సారాంశం

వెలుగు.. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది. కానీ అది వెలుగు కాదు దర్శనం. గతంలో జరిగింది తరవాత జరగబోయేది అంతా చూపిస్తుంది 

ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆయన ఎంచుకునే సినిమాలు అలాంటివి. ఓ ప్రక్కన దేవర వంటి భారీ ప్రాజెక్టు చేస్తూనే మరో ప్రక్కన ప్రశాంత్ నీల్ తోనూ, హిందీలో యష్ రాజ్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. అక్కడ వరస సినిమాలు చేసేందుకు ఎగ్రిమెంట్ చేసారని వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో మరో సినిమా ఆయన సైన్ చేసారనే వార్త ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిగా మారింది. అదే కాంతారా ప్రీక్వెల్ లో ఆయన గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని.

రీసెంట్ గా  కర్ణాటకకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ని అలాగే రిషబ్ శెట్టిని కలిశారు.  ఈ నేపధ్యంలో తన ప్రాజెక్టుల కోసమే ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళాడని.. అలాగే కాంతార ప్రాజెక్టులో కూడా అతను ఒక భాగం కాబోతున్నాడనే .. వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేశాడా లేదా కేవలం రూమరేనా అనే విషయం మీద అయితే క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ  ఎన్టీఆర్ కనుక ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేస్తే.. ఖచ్చితంగా కాంతార సినిమాకు తెలుగులో ఓ రేంజిలో బజ్ క్రియేట్ అవుతుందనటంలో సందేహం లేదు.  

ఇక ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ను తెరకెక్కిస్తున్నారు. ‘కాంతార’ ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రశంసలు అందుకుంది. అందుకే, ఇప్పుడు ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ను ఇంగ్లిష్‌లో కూడా రూపొందిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమాను 7 భాషల్లో సిద్ధం చేస్తున్నారు. ఈరోజు ఆ 7 భాషల్లో ఫస్ట్ లుక్‌ను, ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రిషబ్ శెట్టి మరోసారి ఆశ్చర్యపరిచారు. యోధుడి రూపంలో రిషబ్ శెట్టి భయపెట్టారు. పరమశివుడి అవతారంలా కనిపించారు.

వెలుగు.. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది. కానీ అది వెలుగు కాదు దర్శనం. గతంలో జరిగింది తరవాత జరగబోయేది అంతా చూపిస్తుంది ఆ వెలుగు. కనబడుతుందా?’ అనే డైలాగ్‌తో కథ మలుపు తీసుకుంటుంది. శివ ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుడు వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు కథ కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. యోధుడి రూపంలో రిషబ్ శెట్టి పరిచయం అవుతారు. కండలు తిరిగిన శరీరం, పొడుగాటి జులపాలు, గుబురు గెడ్డంతో మహాశివుడి రూపంలో ఆ యోధుడు దర్శనమిచ్చాడు. శత్రువులను చీల్చి చెండాడుతూ నిలబడ్డాడు.

‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ ద్వారా 4వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారు రిషబ్ శెట్టి. సుమారు నాలుగు శతాబ్దాల పాటు ఉత్తర కర్ణాటకను పాలించిన కదంబ రాజవంశీయుల కాలంలోకి వెళ్లబోతున్నాం. కదంబ రాజ్యంలో పుట్టిన ఒక యోధుడిని చాప్టర్ 1లో పరిచయం చేయబోతున్నారు. మరి ఈ కథ ఎన్ని చాప్టర్లలో చెప్తారో వేచి చూడాలి. మొత్తం మీద ‘కాంతార’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ప్రీక్వెల్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. అందుకే ఏకంగా 7 భాషల్లో రూపొందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌
Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌