చూసి...పవన్ ను హగ్ చేసుకున్న ఎన్టీఆర్!

By Surya PrakashFirst Published Apr 14, 2021, 9:18 AM IST
Highlights

వకీల్ సాబ్ చూసిన చాలా మంచి హీరోలు మెచ్చుకున్నారని చెబుతూనే తారక్ వకీల్ సాబ్ కూడా పవన్ ను హగ్ చేసుకున్నారన్న విషయాన్ని వెల్లడించారు.

వకీల్ సాబ్ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రా.. రెండు రాష్ట్రాల్లోనూ కొవిడ్-19 మార్గదర్శకాలు, ఆంక్షలు, టికెట్ ధరలు ఏవీ వకీల్ సాబ్ మూవీ కలెక్షన్స్‌పై ప్రభావం చూపించలేకపోతున్నాయంటున్నారు. వకీల్ సాబ్ మూవీ మార్నింగ్ షోకు ఎప్పుడైతే హిట్ టాక్ వచ్చిందో అలాగే పాజిటివ్ రివ్యూలు వచ్చాయో..అప్పుడే జనాలకు అర్దమైపోయింది. కలెక్షన్స్ లో దుమ్ము రేపబోతున్నారని.  అలాగే యూఎస్, యూకే లాంటి ఓవర్సీస్ మార్కెట్‌లోనూ వకీల్ సాబ్ మూవీకి మంచి స్పందన కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు కేవలం ప్రేక్షకులు,అభిమానులే కాకుండా తోటి సినీ స్టార్స్ సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తారక్ వకీల్ సాబ్ చుసి  పవన్ ను హగ్ చేసుకున్నారన్న విషయాన్ని బయిటకు వచ్చింది.

ఈ సినిమాలో పవన్ కు ఎదురు లాయిర్ గా కనిపించిన ప్రకాష్ రాజ్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా చూసిన విషయాన్ని, హగ్ చేసుకున్న మ్యాటర్ ని వివరించారు. వకీల్ సాబ్ చూసిన చాలా మంచి హీరోలు మెచ్చుకున్నారని చెబుతూనే తారక్ వకీల్ సాబ్ కూడా పవన్ ను హగ్ చేసుకున్నారన్న విషయాన్ని వెల్లడించారు.  ఈ విషయం ఇప్పుడు  పవన్ కళ్యాణ్,తారక్ ఫ్యాన్స్ ఇద్దరికీ మంచి కిక్ ఇస్తోంది.  ఇద్దరి హీరోల  అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఆ వీడియోతో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు 
 
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... పవన్ గారి ఆలోచనలకు చాలా దగ్గరైన కథ ఇది. ఆయనకు చాలా రిలవెంట్ సబ్జెక్ట్. ఆయన కొన్ని సంభాషణలు చెబుతున్నప్పుడు అవి మనసులో నుంచే వచ్చాయి అనిపిస్తుంది. మహిళల గురించి సినిమా చేసినా మనకు సాంగ్స్, ఫైట్స్ కావాలి. పవన్ గారి ఇమేజ్ కు అనుగుణంగా సినిమా చేస్తూనే...అవన్నీ చేర్చారు. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు అని అన్నారు.

ఇక ఒక సినిమాలో నటుడు బాగా నటించాడూ అంటే కథ, సంభాషణలు, సందర్భాలు ఇవన్నీ కుదరాలి. అన్నీ బాగున్నప్పుడు అందులో మా నటన ఎలివేట్ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు లేకపోతే సినిమా లేదు అనేది అబద్ధం. అలా ఎవరైనా అంటే అది వాళ్ల ప్రేమ అనుకుంటాను. వకీల్ సాబ్ సెట్ కు వస్తే నిజంగా కోర్టుకు వచ్చినట్లే అనిపించేది. ఒక రోజు నేను 9 గంటలకు సెట్ కు వస్తే, పవన్ గారు ఉదయం ఏడున్నర గంటలకే వచ్చారు. పవన్ గారిని అడిగితే నాకు నిద్రపట్టలేదు వచ్చేశాను అన్నారు. యూనిట్ అంతా చర్చించుకునే వాళ్లం సీన్సు గురించి అని చెప్పుకొచ్చారు. 
 

click me!