నిర్మాత బండ్ల గణేష్‌కి కరోనా.. ఐసీయూలో చికిత్స.. టెన్షన్‌లో `వకీల్‌సాబ్‌` యూనిట్ ?‌

Published : Apr 13, 2021, 11:13 PM ISTUpdated : Apr 13, 2021, 11:14 PM IST
నిర్మాత బండ్ల గణేష్‌కి కరోనా.. ఐసీయూలో చికిత్స.. టెన్షన్‌లో `వకీల్‌సాబ్‌` యూనిట్ ?‌

సారాంశం

నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కి కరోనా సోకింది. ఆయనకు రెండోసారి కరోనా సోకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. అయితే బండ్ల గణేష్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కి కరోనా సోకింది. ఆయనకు రెండోసారి కరోనా సోకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. అయితే బండ్ల గణేష్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు ఆసుపత్రిలో బెడ్స్ కూడా లేకపోవడంతో చిరంజీవి రికమండేషన్‌తో బెడ్‌ దక్కించుకుని బండ్లగణేష్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఫస్ట్ వేవ్‌ కరోనా సమయంలోనూ బండ్ల గణేష్‌ కరోనాకి గురయ్యారు. టాలీవుడ్‌ సెలబ్రిటీల్లో ప్రధానంగా ఆయన పేరు అప్పట్లో బాగా వినిపించింది. ఆ తర్వాత చాలా మందికి కరోనా సోకింది. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కరోనా విజృంభిస్తోంది. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలను అది వెంటాడుతుంది. ఇప్పటికే అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, నివేదా థామస్‌ వంటి వారికి కరోనా సోకింది. తాజాగా నిర్మాత దిల్‌రాజుకు సైతం కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ టీమ్‌కి కరోనా సోకడంతో ఆయన కూడా ఐసోలేషన్‌ అయ్యారు. `వకీల్‌సాబ్‌` దర్శకుడు వేణు శ్రీరామ్‌కి సైతం ఆరోగ్యం సరిగా లేదనే వార్తలు వినిపించాయి. 

ఇదిలా ఉంటే బండ్ల గణేష్‌ ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అందులో పవన్‌ నా దేవుడంటూ చక్క బజనా చేశాడు. గుక్క తిప్పుకోకుండా పది నిమిషాల పాటు పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఆయన దిల్‌రాజు, వేణు శ్రీరామ్‌, ఇలా చాలా మంది అతిథులను కలిశారు. అందులో పవన్‌ కూడా ఉన్నారు. ఆ ఫంక్షన్‌ వెళ్లిన మరుసటి రోజు నుంచే బండ్ల గణేష్‌ కి ఒళ్లు నొప్పులు స్టార్ట్ అయ్యాయట. కానీ అప్పటికే ఓ సారి కరోనా సోకడంతో, ఇప్పుడు అది కాదులే అని ఆయన లైట్‌ తీసుకున్నారని, కానీ అది తీవ్రమయ్యిందని, చివరికి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని, దీంతో తప్పని పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. 

 అయితే ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారనే వార్త ఆందోళన కలిగిస్తుంది. అలాగే ఇప్పుడు `వకీల్‌సాబ్‌` టీమ్‌ని సైతం కరోనా వెంటాడుతుంది. దీంతో టాలీవుడ్‌ మొత్తం ఇప్పుడు వణికిపోతుంది. ఇప్పుడే హాట్‌ టాపిక్‌గా మారింది. మొత్తానికి `వకీల్‌సాబ్‌` థియేటర్ల వద్ద కనక వర్షంతోపాటు కరోనా వర్షం కురిపిస్తున్నారనే విమర్శలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా