సినిమాలకు గుడ్ బై చెప్పిన ఎన్టీఆర్ హీరోయిన్

Published : Jun 27, 2021, 02:21 PM IST
సినిమాలకు గుడ్ బై చెప్పిన ఎన్టీఆర్ హీరోయిన్

సారాంశం

ఆఫర్స్ కోసం ఎదురుచూసి విసిగిపోయిన కార్తీక సమయం వృధా చేయకూడదని నిర్ణయించుకున్నారట. కొన్నాళ్ల క్రితం కార్తీక ఓ బిజినెస్ స్టార్ట్ చేశారట. ఇక దానిపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట. 

సీనియర్ హీరోయిన్ రాధ నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది కార్తీక నాయర్. నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. జోష్ సినిమాలో లుక్స్ పరంగా ఆమెకు నెగిటివ్ మర్క్స్ పడ్డాయి. అయితే ఆమె రెండవ చిత్రం కో సూపర్ హిట్ కావడం జరిగింది. ఆ సినిమా విజయంతో కార్తీక ఫార్మ్ లోకి వచ్చింది. 


ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో దమ్ము మూవీలో హీరోయిన్ గా చేశారు కార్తీక. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. తమిళంతో పాటు ఇతర పరిశ్రమలలో కూడా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. దీనితో అవకాశాలు రావడం తగ్గింది. 2016లో విడుదలైన వా డీల్ ఆమె చివరి చిత్రం కాగా, ఇక నటనకు గుడ్ బై చెప్పారు. 


ఆఫర్స్ కోసం ఎదురుచూసి విసిగిపోయిన కార్తీక సమయం వృధా చేయకూడదని నిర్ణయించుకున్నారట. కొన్నాళ్ల క్రితం కార్తీక ఓ బిజినెస్ స్టార్ట్ చేశారట. ఇక దానిపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట. 80లలో హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఏలిన రాధకు ఇద్దరు కూతుళ్లు. చిన్న అమ్మాయి తులసి కూడా వెండితెరపై పరిచయమై తరువాత నటనకు బై చెప్పారు.

PREV
click me!

Recommended Stories

800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?
Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్