`గుంటూరు కారం`లో ఎన్టీఆర్‌.. వార్తలకు మూలం అక్కడుంది? త్రివిక్రమ్‌ యూనివర్స్ నిజమేనా?

మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ మంచి ఫ్రెండ్స్. మహేష్‌ని తారక్‌ అన్నా అని పిలుస్తుంటారు. `భరత్‌ అనే నేను` చిత్రానికి ఎన్టీఆర్‌ గెస్ట్ గా వచ్చారు కూడా. అంతేకాదు ప్రైవేట్‌గానే పార్టీల్లో వీళ్లు కలుస్తుంటారు.

Google News Follow Us

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్నారు. `అతడు`, `ఖలేజా` చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ రూట్‌ మార్చి దీన్ని మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. కొంత `అరవింద సమేత` స్టయిల్‌ ఉంటుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. మహేష్‌ చేస్తున్న మరో ఊర మాస్‌ మూవీ అని తెలుస్తుంది. 

ఈ మూవీ అనేక వాయిదాల అనంతరం ఇప్పుడు ఫుల్‌స్వింగ్‌లో నడుస్తుంది. సినిమాని త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్‌ డేట్‌ కూడా వేసుకున్నారు. అయితే షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. దీంతో గ్యాప్‌ లేకుండా షూట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఇది మామూలు వార్త కాదు, ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ గెస్ట్ రోల్‌ చేస్తున్నారనేది ఈ రూమర్‌ సారాంశం. 

మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ మంచి ఫ్రెండ్స్. మహేష్‌ని తారక్‌ అన్నా అని పిలుస్తుంటారు. `భరత్‌ అనే నేను` చిత్రానికి ఎన్టీఆర్‌ గెస్ట్ గా వచ్చారు కూడా. అంతేకాదు ప్రైవేట్‌గానే పార్టీల్లో వీళ్లు కలుస్తుంటారు. అదే సమయంలో ఎన్టీఆర్‌తోనూ త్రివిక్రమ్‌కి మంచి అనుబంధం ఉంది. వీరి కాంబోలో `అరవింద సమేత` వచ్చింది. మహేష్‌ కంటే ముందు త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాల్సింది. అధికారికంగా ప్రకటించి క్యాన్సిల్‌ చేశారు. ఈ నేపథ్యంలో `గుంటూరు కారం`లో ఎన్టీఆర్‌ గెస్ట్ రోల్‌ చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. 

అయితే దీనికి ఓ కారణం ఉంది. `అరవింద సమేత` చిత్రంలో వాడిన పార్టీ గుర్తు, `గుంటూరు కారం`లోనూ ఉండటం. అంతేకాదు, ఈశ్వరీ రావు అందులోనూ, ఇందులోనూ ఉండటం. ఆ పాత్రకి ఎక్స్ టెండెడ్‌గా ఉండటంతో ఆయా సీన్‌ క్లిప్పులను తెరపైకి తీసుకొస్తూ ఇందులో ఎన్టీఆర్‌ కొమియో రోల్‌ చేస్తున్నారని, అంతేకాదు ఇది త్రివిక్రమ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ అంటున్నారు. లోకేష్‌ యూనివర్స్, ప్రశాంత్‌ నీల్‌ యూనివర్స్ మాదిరిగా, త్రివిక్రమ్‌ కూడా తన సినిమాటిక్‌ యూనివర్స్ ని ప్రారంభించారని, అందులో భాగంగా `అరవింద సమేత`కి, `గుంటూరు కారం` చిత్రానికి సంబంధం ఉందని సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు ఇరు హీరోల ఫ్యాన్స్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

అయితే చిత్ర పరిశ్రమ నుంచిగానీ, చిత్ర వర్గాల నుంచి గానీ, ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు లేదు. మహేష్‌తో తారక్‌ చేస్తున్నారనేది వాస్తవం కాదని తెలుస్తుంది. అది ఫ్యాన్స్, నెటిజన్లు ఊహించుకున్నదే గానీ, వాస్తవంగా త్రివిక్రమ్‌ ఆ ఆలోచనలో లేరని తెలుస్తుంది. ఎందుకంటే సినిమా కూడా దగ్గరపడుతుంది. ఇలాంటిది ఏదైనా ఉంటే చాలా రోజులుగా వినిపించేది, అలాంటిదేదీ లేదు. అందుకే ఇది కేవలం సోషల్‌ మీడియా రూమరే అని అంటున్నారు. అసలు నిజాలేంటనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...