
గత కొద్ది నెలలుగా రీరిలీజ్ ట్రెండ్ మంచి ఊపు మీద నడుస్తున్న సంగతి తెలిసందే. పవన్ కల్యాణ్ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, ప్రభాస్ వర్షం ఇలా వరస పెట్టి అందరి హీరోల సినిమాలు రీరిలీజ్ చేస్తున్నారు. మొన్న శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ రీరిలీజ్ చేశారు. మ రో ప్రక్క బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి ఇప్పటికే మరోసారి థియేటర్లలో సందడి చేసింది. త్వరలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును పరిచయం చేసిన చిత్రం సింహా (Simha) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మార్చి 11న థియేటర్లలో సింహాతో మరోసారి గర్జించేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ చిత్రాలు సైతం రీరిలీజ్ యాత్రలు బయిలుదేరాయి. తాజాగా ఎన్టీఆర్ చిత్రం ‘ఆంధ్రావాలా’రీ రిలీజ్ కు రెడీ అయ్యింది.
తన డైలాగులుతో, హీరో యాటిట్యూడ్ తో మైమరిపించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ టైమ్ లో వర్కవుట్ కాలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ‘నాయ్రే నాయ్రే’ పాటకు తారక్ వేసిన స్టెప్పులు గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాగే ఈ సినిమా ఆడియో లాంఛ్కు అప్పట్లో 5 లక్షలకు పైగా జనాలు రావడం అప్పట్లో సెన్సేషన్.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘సింహాద్రి’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం ద్వారా రిలీజ్ కావడం, సక్సెస్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించడంతో ‘ఆంధ్రావాలా’పై ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. కానీ సినిమా మాత్రం అందుకు తగ్గట్లుగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు.. 2004 జనవరి 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రక్షిత హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా.. సాయాజీ షిండే రాహుల్ దేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే నెల వచ్చే వారంలో మరోసారి థియటర్లలోకి రాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ మూవీగా నిలిచిన ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. బాక్సాఫీసు వద్ద భారీ పరాజయాన్ని పొందిన ఈ చిత్రం రీరిలీజ్ అవుతుందనడంతో అంతా షాక్ అవుతున్నారు.
ఇక ఎన్టీఆర్ తనకు గతంలో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కు ఇది 30వ చిత్రం కావడంతో ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీని తర్వాత తారక్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా మొదలు కాబోతుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31 చిత్రాన్ని తెలుగు కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నారు.