8 సినిమాలు చేసి ముఖాన కొడతా.. ఆర్ఆర్ఆర్ టీమ్ పై తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు వ్యాఖ్యలు

Published : Mar 09, 2023, 01:38 PM IST
8 సినిమాలు చేసి ముఖాన కొడతా.. ఆర్ఆర్ఆర్ టీమ్ పై తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

ఆర్ఆర్ఆర్ టీమ్ పై ఘాటు విమర్షలు చేశారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. RRR సినిమా యూనిట్  పై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. 

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం  చేసిని సినిమా ఆర్ఆర్ఆర్. తెలుగు సినిమా సత్తాను నలుదిశలా చాటిన వ్యక్తి  డైరెక్టర్ రాజమౌళి.  తెలుగు సినిమా ఇంత ఎత్తు ఎదుగుతుంటే.. పక్క రాష్ట్రాల ఇండస్ట్రీల నుంచి కాని.. బాలీవుడ్ నుంచి కాని వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరిగితే.. పెద్దగా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. కాని సొంత ఇండస్ట్రీ నుంచి ట్రిపుల్ ఆర్ పై విమర్శలు అంటేనే.. ఔరా అంటున్నారు ఆడియన్స్. అవును ఇది నిజం.  విమర్శలు చేసింది సోషల్ మీడియాలో  ఓ నెటిజన్ అయ్యింటే.. లేదా సినిమా చూసిన  ఆడియన్స్  అయ్యుంటే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో.. కాని టాలీవుడ్  సినీ ప్రముఖులే RRR పై విమర్శలు చేస్తున్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రేమికులు వారిపై  పండిపడుతున్నారు.  

ట్రిపుల్ ఆర్ టీమ్ పై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. RRR సినిమా యూనిట్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్ గా ఓ  ప్రెస్ మీట్ లో  మాట్లాడిన తమ్మారెడ్డి... టాలీవుడ్ సినిమాలు వాటి బడ్జెట్ పై ప్రశ్నలు ఎదరవ్వగా.. ఈ వ్యాఖ్యలు చేశారు.  బడ్జెట్ గురించి టాపిక్ రావడంతో  ఆయన మాట్లాడుతూ.. అప్పడు  బాహుబలి కోసం  200 కోట్లు పెట్టారు.  అయితే ఆసినిమా హిట్ అయ్యింది కాబట్టి సరిపోయింది... ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయ్యి ఉంటే  ఏమైయ్యేది. అప్పుడు రాజమౌళిని అందరూ పిచ్చోడు అనుకునేవాళ్లు. లోకల్ సినిమాకి 200 కోట్లు  ఎవరైనా పెడతారా అని అంతా ఆశ్చర్యపోయారు అంటూ తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. 

అంతే కాదు బాహుబలి  సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు భారీ సినిమాలు వస్తున్నాయి.. లేకుంటే ఇలాంటి సినిమాలు అసలు చూసేవాళ్ళం కాదు అన్నారు తమ్మారెడ్డి. ఇక  ప్రస్తుతం కొత్తగా సినిమా ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు.  RRR టీం కూడా  అదే పని చేస్తుంది. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం దాదాపు 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు. సూట్లు వేసుకొని, ఫ్లైట్స్ టికెట్స్ వేసుకొని.. విదేశాలు తిరుగుతూ.. డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అదే 80 కోట్లు నాకు ఇస్తే ఓ 8 సినిమాలు తీసి మొహాన కొడతాను అని అన్నారు. దీంతో తమ్మారెడ్డి  వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అటు అభిమానులు, ఆడియన్స్ తమ్మారెడ్డిపై మండిపడుతున్నారు. 

ఇక  RRR సినిమా  ఆస్కార్ దగ్గర వరకూ వెళ్లింది. ఆస్కార్ సాధించడానికి అడుగు దూరంలో ఉంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సాధించింది. ఆస్కార్ కు సమానమైన గోల్డెన్ గ్లోబ్ ను కూడా సాధించింది. వరల్డ్ వైడ్ గా దిగ్గజ ఫిల్మ్ మేకర్స్ ప్రశంసలు కూడా అందుకుంది ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా ఘనతను మర్చిపోయి.. ఇలా ఇండస్ట్రీవారే విమర్శించడం అందరికి వింతగా అనిపిస్తోంది. ఈనెల 12న ఆస్కార్ వేడుకలు ఉండటంతో.. ప్రస్తుతం  RRR టీమ్ అమెరికాలో సందడి చేస్తుంది. రాజమౌళి  గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటూ ఆర్ఆర్ఆర్ ను  మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, ఎన్టీఆర్ ఇలా మరికొంత మంది టీమ్ అక్కడే ఉంటూ.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?