‘ఆస్కార్’ ఈవెంట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సారి స్పీచ్ ఇవ్వబోతున్నారు. విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రాబోతుండటంతో అంతా ఆయనకోసం ఎదురుచూస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. ఇక నిన్న ‘ఆస్కార్’ అవార్డు సైతం దక్కడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఈక్రమంలో NTR తొలిసారిగా పబ్లిక్ స్పీచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆస్కార్ వరించిన సందర్భంలో ఎన్టీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఏ వేదికన మాట్లాడబోతున్నారంటే..
మరోసారి హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ కు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ లో సినిమాపై హైప్ పెరుగుతోంది. జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ మూవీపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. విశ్వక్ సేన్ నిన్న కరీంనగర్ లో జరిగిన ‘దమ్కీ’ రెండో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
మార్చి 17న ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేస్తున్నారు. ఆస్కార్ అందిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ ‘దమ్కీ’ సినిమా ఈవెంట్ కు వస్తుండటం.. పబ్లిక్ గా ఫస్ట్ స్పీచ్ ఇవ్వతోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ట్వీటర్ వేదిక తన సంతోషాన్ని వ్యక్తం చేసిన... తారక్ స్పీచ్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రాకతో విశ్వక్ సేన్ సినిమాకు మంచి హైప్ వచ్చింది. మరోవైపు నాని ‘దసరా’కు ముందే రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాగా బజ్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం ధమ్కీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. చిత్రాన్ని వన్మయ్ క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) విశ్వక్ సేన సరసన నటించింది. తాజాగా సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ 2.0 యూట్యూబ్ లో #1లో ట్రెండింగ్ అవుతోంది. వారం రోజుల్లో థియేటర్లలో కి రానున్న ఈ చిత్రం ఎలా అలరిస్తుందో చూడాలి.