RRR: ఎన్టీఆర్‌ అరుదైన ఘనత.. ఇండియాలోనే ఆ ఘనత సాధించిన తొలి నటుడు

Published : Jan 05, 2023, 05:13 PM IST
RRR: ఎన్టీఆర్‌ అరుదైన ఘనత.. ఇండియాలోనే ఆ ఘనత సాధించిన తొలి నటుడు

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌ నటనకు విశేష స్పందన దక్కుతుంది. అవార్డులు కూడా వరిస్తున్నాయి. తాజాగా ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. 

ఎన్టీఆర్‌ అద్భుతమైన నటుడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన నటన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో ప్రపంచానికి తెలిసింది. అందుకే ఇప్పుడు అంతర్జాతీయంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డు కోసం పోటీలో ఉన్నారు. `ఆర్‌ ఆర్‌ఆర్‌` చిత్రాన్ని డైరెక్షన్‌, సాంగ్స్, ఉత్తమ నటుల కేటగిరీలో ఆస్కార్‌ నామినేషన్‌ కోసం పోటీ పడుతుంది. 

ఇప్పటికే `నాటు నాటు` పాటకి ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకంది. షార్ట్ లిస్ట్ లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకు అకాడమీ బృందం ఓటింగ్‌ నిర్వహించి జనవరి 24న నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న అవార్డులను ప్రకటిస్తారు. ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌`కి అవార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే తారక్‌ అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ హాలీవుడ్‌ పత్రిక ప్రకటించిన ప్రిడిక్షన్‌లో చోటు సంపాదించారు. `వెరైటీ` మ్యాగజీన్‌ ప్రకటించిన టాప్‌ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్‌ పేరు మెన్షన్‌ చేయడం విశేషం. ఈ లిస్ట్ లో విల్‌ స్మిత్‌, హ్యూ జాక్మన్‌ లు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఇలా హాలీవుడ్‌ ప్రముఖ మీడియా సంస్థలు ప్రకటించిన ప్రిడిక్షన్‌లో నిలిచిన తొలి ఇండియన్‌ యాక్టర్‌గా ఎన్టీఆర్‌ నిలవడం విశేషం. ఇదొక అరుదైన ఘటనగా చెప్పొచ్చు.  మరి ఊహించినట్టుగానే తారక్‌కి నామినేట్‌ అవుతాడా?

1920 బ్యాక్ డ్రాప్‌లో స్వాతంత్రసమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు వీరుడు కొమురంభీమ్‌ పాత్రల ఆధారంగా దర్శకుడు రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని రూపొందించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అల్లూరిగా చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటించారు. వీరికి జోడీగా అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ నటించారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలో మెరిశారు. ఈ సినిమా ఇప్పుడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు కూడా పోటీ పడుతుంది. దీనికోసం రామ్‌చరణ్‌, రాజమౌళి, ఎన్టీఆర్‌ పాల్గొనబోతున్నట్టు సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే