బ్యాంకాక్ వీధుల్లో సేల్స్ గర్ల్ గా 'బాహుబలి' నటి!

Published : Jun 11, 2019, 09:41 AM IST
బ్యాంకాక్ వీధుల్లో సేల్స్ గర్ల్ గా 'బాహుబలి' నటి!

సారాంశం

తెలుగులో బాహుబలి సినిమాలో 'మనోహరి' పాటకి డాన్స్ చేసి మెప్పించిన నటి నారా ఫతేహి.. ఆ తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. 

తెలుగులో బాహుబలి సినిమాలో 'మనోహరి' పాటకి డాన్స్ చేసి మెప్పించిన నటి నారా ఫతేహి.. ఆ తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాలో ఈ బ్యూటీ కనిపించింది. ప్రస్తుతం ఈమె బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తోంది.

ట్రిప్ కోసం అక్కడకి వెళ్లిన ఈ బ్యూటీ సేల్స్ గర్ల్ గా మారి బట్టలు అమ్మడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ బ్యాంకాక్ మార్కెట్ లో నేల మీద కూర్చొని బట్టలు అమ్ముతోంది.

ఈ వీడియోలో ఆమె ఎలాంటి మేకప్ లేకుండా అచ్చం సేల్స్ గర్ల్ మాదిరిగానే ఉంది. తన కస్టమర్లతో స్థానిక భాషలో మాట్లాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'స్ట్రీట్ డాన్సర్' అనే సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి