
బిగ్‌బాస్4 పదమూడో రోజు పలు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. హీరో-జీరో ఎపిసోడ్ హైలైట్ అయ్యింది. అదే సమయంలో ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిని నాగ్ తిట్టాడు. దీంతోపాటు హీరో-జీరో సెషన్‌లో దేవి నాగవల్లి మరోసారి ఏదో జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. తమపై కుట్రలు చేశారని పరోక్షంగా ఆరోపించారు. అమ్మ రాజశేఖర్‌ని జీరోగా చూపించి ఆయన కామెడీ శృతి మించిందని, అలాగే ఆయన చేష్టలను విమర్శించింది.
ఇక అరియానాపై ప్రశంసలు కురిపించింది. తనకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉందన్నారు. మరోవైపు అందరు అమ్మ రాజశేఖర్ మాస్టర్‌పేరుని హీరో- జీరోకి చూపించడంతో గంగవ్వ మాత్రం `నన్ను పంపించినా ఫర్వాలేదు, ఆయన ఉండాలని చెప్పడం హైలైట్ అయ్యింది. అలాగే ఇందులో అత్యధికంగా కుమార్ సాయి జీరో అని, ఆయన్ని పంపించాలని సభ్యులు సూచించడం గమనార్హం.
ఈ సెషన్ పూర్తయిన తర్వాత అమ్మ రాజశేఖర్‌ని ఓదార్చే క్రమంలో లాస్యకి, దివికి మధ్య గొడవ అయ్యింది. దివి ఏదో విమర్శిస్తుండగా, లాస్య ఆమెని గట్టిగా తిట్టింది. మరికొందరు లాస్యకి మద్దతు పలికారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. హీరో-జీరో సెషన్‌లో మద్దతు ప్రకటించే విషయంలోనే దివి ఇలా కామెంట్ చేసి ఉండొచ్చు.
అలాగే ఈ సారి ఎలిమినేషన్‌లో గంగవ్వని ముందుగానే సేఫ్ అని నాగ్ చెప్పేశాడు. దీంతో ఆమె రిలాక్స్ అయ్యింది. ఆమె ఆరోగ్యం కూడా కుదుట పడిందని తెలిపింది.
ఇదిలా ఉంటే కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయిన తర్వాత సభ్యులతో సెల్ఫీ తీసుకునేందుకు ఫోన్ తీసుకురావడానికి రూమ్‌కి వెళ్ళిన నోయల్ ఒక్కడే గదిలో ఏడ్చాడు. ఆయన ఎందుకు ఏడ్చాడో అర్థం కాలేదు. కళ్యాణి వెళ్ళిపోతున్నందుకైతే డైరెక్ట్ గా ఆమె వద్దే ఆ సానుభూతిని, ఎమోషన్‌ని పంచుకోవచ్చు.కానీ ఆయన రూమ్‌లో ఒంటరిగా ఏడవడం ఆశ్చర్యానికి కలిగించింది. కళ్యాణి వెళ్లిపోతుంటే మోనాల్ కూడా కన్నీళ్ళు పెట్టుకోవడం విశేషం.