కరాటే కళ్యాణి ఎలిమినేటెడ్‌‌.. వెన్నుపోటు పొడిచారని కన్నీళ్ళు

Published : Sep 19, 2020, 10:50 PM IST
కరాటే కళ్యాణి ఎలిమినేటెడ్‌‌.. వెన్నుపోటు పొడిచారని కన్నీళ్ళు

సారాంశం

బిగ్‌బాస్‌4 రెండో వారంలో తొమ్మిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. సెల్ఫ్‌గా ఎవరికి వారు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. అయితే సెల్ఫ్‌ ఎలిమినేషన్‌పై నాగ్‌ ఫైర్‌ అయ్యారు. 

బిగ్‌బాస్‌4 రెండో వారంలో ఎలిమినేషన్‌లో ఎవరో తెలిసిపోయింది. అందరు ఊహించిన నట్టే కరాటే కళ్యాణి ఎలిమినేట్‌ అయ్యారు. ఆమె ఎలిమినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ నాగార్జున చెప్పారు. 

బిగ్‌బాస్‌4 రెండో వారంలో తొమ్మిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. సెల్ఫ్‌గా ఎవరికి వారు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. అయితే సెల్ఫ్‌ ఎలిమినేషన్‌పై నాగ్‌ ఫైర్‌ అయ్యారు. ఆడటానికి వచ్చారా? వెళ్ళిపోవడానికి వచ్చారా? అంటూ మండిపడ్డారు. సభ్యులందరికి క్లాస్‌పీకాడు. 

ఇక హీరో, జీరో ఎపిసోడ్‌ తర్వాత ఎలిమినేషన్‌ గురించి తేల్చి చెప్పేశాడు బిగ్‌బాస్‌. రెండో వారంలో రెండు ఎలిమినేషన్లు ఉంటాయని, శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఎలిమినేట్‌ అవుతారని చెప్పిన నాగ్‌ శనివారం మొదటి ఎలిమినేట్‌ పర్సన్‌ని నస పెట్టకుండా డైరెక్ట్‌గా కరాటే కళ్యాణి పేరు చెప్పేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 

ఎలిమినేషన్‌ చెప్పేసి నాగ్‌ వెళ్ళిపోయాడు. ఇక కరాటే కళ్యాణిని అందరు ఓదార్చారు. అందుకు తాను స్పందిస్తూ, ఎలిమినేట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, తన బాబుని చూసుకోవాలని, బయట చాలా పనులున్నాయని తెలిపింది. అంతేకాదు ఇందులో ఉండలేని వెన్నుపోట్లు పొడుస్తున్నారని, అవన్నీ తట్టుకోలేకపోతున్నానని తెలిపింది. సభ్యులందరు ఆమెని దగ్గరుండి హౌజ్‌ నుంచి బయటకు పంపించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా