Allu Sirish: అల్లు శిరీష్ సినిమాలు ఏమైనట్లు.. అసలేం జరుగుతోంది ?

Published : Jun 13, 2022, 10:58 AM IST
Allu Sirish: అల్లు శిరీష్ సినిమాలు ఏమైనట్లు.. అసలేం జరుగుతోంది ?

సారాంశం

ఎబిసిడి డిజాస్టర్ తర్వాత శిరీష్ ' ప్రేమ కాదంట' అనే చిత్రాన్ని ప్రకటించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది పైనే గడిచిపోతోంది.

మెగా హీరో అనే ట్యాగ్ తోనే శిరీష్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు దాదాపుగా అందరూ విజయాల బాటలో పయనిస్తున్నారు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెనతో బంపర్ హిట్ కొట్టాడు. కొండ పొలం లాంటి విభిన్న చిత్రాలు చేస్తున్నాడు. 

ఇక అల్లు శిరీష్ మాత్రం హీరోగా సుస్థిర స్థానం ఏర్పరుచుకోలేదు. ఇప్పటికి అతడి కెరీర్ తడబడుతూనే సాగుతోంది. శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే శ్రీరస్తు శుభమస్తు' మాత్రమే. ఇప్పుడు శిరీష్ సినిమాల పరంగా, సోషల్ మీడియాలో శిరీష్ యాక్టివ్ గా లేడు. 

అల్లు అరవింద్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ తన కొడుకు కెరీర్ పై ఫోకస్ ఎందుకు పెట్టడం లేదు అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఎబిసిడి డిజాస్టర్ తర్వాత శిరీష్ ' ప్రేమ కాదంట' అనే చిత్రాన్ని ప్రకటించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది పైనే గడిచిపోతోంది. ఇంతవరకు కొత్త అప్డేట్ లేదు. 

ఈ చిత్రంలో శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఇద్దరి మధ్య ఘాటు రొమాన్స్ ఉండబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనితో మంచి బజ్ కూడా ఏర్పడింది. కానీ సినిమా షూటింగ్ జరుగుతోందా ఆగిపోయిందా అనే ఎలాంటి అప్డేట్ లేదు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో శిరీష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నాడు. జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఫొటోస్ షేర్ చేసేవాడు. మరో చిత్రానికి కూడా కసరత్తులు జరుగుతున్నాయని తెలిపాడు. ఆ ఊసు కూడా ఇప్పుడు లేదు. మరి అల్లు శిరీష్ సినిమాల పరిస్థితి ఏంటి.. ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే చర్చ జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?