#Salaar:ఆ రోజు కనక అప్డేట్ లేకపోతే మార్చికు వాయిదా పడినట్లేనా?!

క్రిస్మ‌స్ బ‌రిలో రిలీజ్ కి వ‌స్తున్న స‌లార్ పూర్తిగా మాస్ యాక్ష‌న్ కంటెంట్ తో తెర‌కెక్క‌గా...ఈ సినిమాకుసంభందించిన అప్డేట్స్ రాకపోవటం ఫ్యాన్స్ అని ఆందోళనకు గురి చేస్తోంది.

 

No updates by Diwali,Salaar might be rescheduled to March 2024?JSP


 ప్ర‌భాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్ (Salaar). ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా న‌టిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే సలార్ సినిమా టీజర్ ని విడుదల చేసి ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందని ప్రకటించి సినిమాపై హైప్ రెట్టింపు చేసారు. అయితే అభిమానుల్లో మాత్రం ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుందని, ఈ సారి మాత్రం వాయిదా పడదు అని ప్రకటించారు చిత్రయూనిట్.

 అయితే ఇప్పటిదాకా సినిమాకు సంభందించి కొత్త అప్డేట్స్ రాకపోవటంతో దీపావళికి కనుక కొత్త అప్డేట్ రాకపోతే సినిమా రిలీజ్ డౌట్ అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ . అప్పుడు ఈ సినిమా మార్చి 2024కు రీషెడ్యూల్ అవుతుందని భావిస్తున్నారమని చెప్తున్నారు. ఇందుకు సంబందించిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇది అభిమానుల వెర్షన్ మాత్రమే. మేకర్స్ ఈ లోగా అప్డేట్ ఇచ్చారంటే మొత్తం సీన్ మారిపోతుంది.  ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తూండటంతో పని ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ప్రబాస్ సినిమా అంటే అంచనాలను రీచ్ అవటం కోసం కసరత్తులు బాగా చెయ్యాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వారు అప్డేట్ విషయంలో నానుస్తున్నట్లున్నారు.

Latest Videos


  
 ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. భారీ యాక్ష‌న్ కంటెంట్ కి త‌గ్గ‌ట్టే వీఎఫ్ ఎక్స్ షాట్స్ ని కూడా ప్ర‌శాంత్ నీల్ మ‌రో లెవ‌ల్లో చిత్రీక‌రించార‌ని చెబుతున్నారు.  డిసెంబ‌ర్ లో షారూఖ్ డంకీతో పోటీప‌డుతూ స‌లార్ విడుద‌ల‌కు రెడీ అవుతోంది.మరో ప్రక్క స‌లార్ ప్ర‌మోష‌న్స్ వీక్ గా ఉన్నాయంటూ అభిమానులు నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాకు ప్రత్యేకమైన ప్రమోషన్ అవసరమా అనేది నిజమైన వాదన.

vuukle one pixel image
click me!