ఫ్లాపుల ఎఫెక్ట్: రాజ్ తరుణ్ ఫ్రీ గా చేస్తున్నాడా..?

Published : Jan 31, 2019, 11:57 AM IST
ఫ్లాపుల ఎఫెక్ట్: రాజ్ తరుణ్ ఫ్రీ గా చేస్తున్నాడా..?

సారాంశం

యువ హీరో రాజ్ తరుణ్ హిట్టు సినిమా చేసి చాలా కాలమవుతుంది. గతేదాడిలో 'రంగులరాట్నం', 'రాజుగాడు', 'లవర్' ఇలా మూడు చిత్రాల్లో నటించాడు. ఈ మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో డీలా పడిపోయాడు రాజ్ తరుణ్. 

యువ హీరో రాజ్ తరుణ్ హిట్టు సినిమా చేసి చాలా కాలమవుతుంది. గతేదాడిలో 'రంగులరాట్నం', 'రాజుగాడు', 'లవర్' ఇలా మూడు చిత్రాల్లో నటించాడు. ఈ మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో డీలా పడిపోయాడు రాజ్ తరుణ్.

వీటి ఎఫెక్ట్ తో హీరోగా సైన్ చేసిన సినిమాలు కూడా అటకెక్కాయి. దర్శకనిర్మాతలు అతడితో సినిమాలు చేయడానికి ఆలోచిస్తున్నారు. దీంతో తనతో సినిమా చేయమని దిల్ రాజుని అడిగాడట రాజ్ తరుణ్. దీంతో తన బ్యానర్ కి లవర్ లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చినా.. అతడితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు.

తన దగ్గర ఉన్న కథల్లో ఒక కథను ఎంపిక చేసి పనులు మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు రాజ్ తరుణ్ కి ఎలాంటి రెమ్యునరేషన్ ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో రాజ్ తరుణ్ కి క్రేజ్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కూడా రెమ్యునరేషన్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి డీల్ మాట్లాడలేదట.

దీంతో ఈ సినిమాను ఫ్రీగానే చేయడానికి సిద్ధపడుతున్నాడు రాజ్ తరుణ్. ఒకప్పుడు సినిమాకు కోటిన్నర నుండి రెండు కోట్లు డిమాండ్ చేసే ఈ హీరో ఇప్పుడు ఫ్రీగా సినిమా చేస్తుండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి గైడెన్స్ లేకుండా కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోవడం వలన రాజ్ తరుణ్ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని  చెప్పుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు