ప్రైవేట్ ఫోటోలు లీక్.. హన్సిక మరోసారి ఫైర్!

By Udayavani DhuliFirst Published Jan 31, 2019, 10:24 AM IST
Highlights

కోలివుడ్ స్టార్ హీరోయిన్ హన్సికకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో కొన్ని సెల్ఫీలు కూడాఉన్నాయి. ఫోటోలు లీక్ కావడంపై స్పందించిన హన్సిక తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని వెల్లడించింది. 

కానీ సోషల్ మీడియాలో మాత్రం హన్సిక అవకాశాలు తగ్గడంతో కావాలనే ఇలా చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఈ వ్యవహారంపై మాట్లాడింది హన్సిక.

ఎప్పుడూ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంటానని, ఇలా లీకులు ఇచ్చి పాపులారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ఫైర్ అయింది. ఇలాంటి కామెంట్లను తను పెద్దగా పట్టించుకోనని, లీకులపై తనకు ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేసింది. అయినా అవి ఇప్పటి ఫోటోలు కావని, నాలుగేళ్ల క్రితం తీసుకున్న ఫోటోలని అంటోంది.

వాటిలో కొన్ని ఫోటోషూట్ కోసం తీసుకున్నవని, మరికొన్ని తను పర్సనల్ గా తీసుకున్న ఫోటోలని వెల్లడించింది. కొన్ని ఫోటోలను మార్ఫింగ్ కూడా చేశారని అంటోంది. దీంతో నెటిజన్లకు మరో పాయింట్ దొరికింది. మార్ఫింగ్ చేసిన ఫోటోలైతే ఇప్పటివరకు ఎందుకు పోలీస్ కంప్లైంట్ చేయలేదని మళ్లీ హన్సికను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.  

click me!