నిజాన్ని ఎవరూ ఆపలేరు.. టీడీపీ నేతపై వర్మ ఫైర్!

Published : Mar 12, 2019, 04:56 PM IST
నిజాన్ని ఎవరూ ఆపలేరు.. టీడీపీ నేతపై వర్మ ఫైర్!

సారాంశం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై మొదటి నుండి టీడీపీ నేతలు వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. వర్మపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేయడంతో పాటు కోర్టుని సైతం ఆశ్రయించారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై మొదటి నుండి టీడీపీ నేతలు వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. వర్మపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేయడంతో పాటు కోర్టుని సైతం ఆశ్రయించారు. కానీ వర్మ మాత్రం తన సినిమాను అనుకున్న సమయానికి థియేటర్ లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఎన్నికలకు ముందు మార్చి 22న ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి కంప్లైంట్ చేశారు. రాబోయే ఏపీ ఎన్నికల్లో ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సినిమాలో సీఎం చంద్రబాబుని నెగెటివ్ గా చూపించారని, ఓటర్లపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్మ సోషల్ మీడియా వేదికగా టీడీపీ పార్టీపై ఫైర్ అయ్యారు. ఎలాంటి ఫోర్స్ తన సినిమాను థియేటర్ లోకి రాకుండా ఆపలేదని ట్వీట్ చేశాడు.

టీడీపీ పార్టీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రిలీజ్ ఆపాలని ఎలెక్షన్ కమీషన్ ని సంప్రదించిందని కానీ ఎవ్వరూ కూడా నిజాన్ని ఆపలేరంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే